జికా వైరస్ సోకినా వారిలో కనపడే లక్షణాలు ఏంటి ?

ఎబోలా వైరస్ సృష్టించిన బీభత్సం మర్చిపోకముందే మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అసలే కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్న జనాలకు ‘జికా’ అనే కొత్త సవాల్ ఎదురైంది. దోమల ద్వారా వ్యాపించే జికా అనే మహమ్మారి ఇప్పటికే 25 దేశాల్లో విస్తరించింది. దాదాపు 4వేల మంది అప్పుడే పుట్టిన శిశువుల భవితవ్యాన్ని అంధకారం చేసింది. వారిలో దాదాపు 50 మంది చిన్నారులు చనిపోయారు కూడా.

జికా వైరస్జికా వైరస్ దోమ కాటు వలన మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా ఈ వైరస్ సోకుతుంది. ఎల్లో ఫీవర్, వెస్ట్‌నైల్ చికన్‌గన్యా, డెంగ్యూ వంటి వైరస్‌ల కుటుంబానికి చెందినదే జికా. ఆఫ్రికాలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా లాటిన్ అమెరికా, పలు యూరప్ దేశాలకు విస్తరించింది. ఈ జికా వైరస్‌కు పగటిపూట కుట్టే దొమలే కారణమని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందడానికి కూడా ఇదే దోమ కారణం.

జికా వైరస్జికా వైరస్‌ను తొలిసారిగా 1947లో ఆఫ్రికాలోని ఉగాండలో గుర్తించారు. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్‌, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి. కేరళలో తాజాగా జికా వైరస్ కలకలం సృష్టించింది. ఓవైపు కరోనా మహమ్మారి కోరలు చాస్తుండగా.. మరోవైపు జికా వైరస్ ఎటాక్ చేస్తోంది. జికా వైరస్‌ని జికా ఫీవర్ లేదా జికా వైరస్ డిసీజ్ అని కూడా అంటారు. జికా వైరస్ సోకిన రోగికి వ్యాధి నయం చేసే మందులు లేవు.

జికా వైరస్జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. అయితే, మొదట రోగ నిర్ధారణ చేయడం చాలా కష్టం. చాలా మంది రోగులు ఫ్లూ లక్షణాలుగా భావించి నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. తాము జికా బారిన పడ్డామని తెలుసుకునేందుకు చాలా సమయం పడుతుంది.

జికా వైరస్జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. ఇటువంటి లక్షణాలు ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చు. ఓకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించటానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చును. వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ళవరకు ఉండవచ్చును. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాపింపచేసె పరిస్థితిలో వారుంటారు.

జికా వైరస్ఇక అరుదైన సందర్భాల్లో జికా వైరస్ కూడా ఆటో ఇమ్యూన్ ఇన్‌ఫెక్షన్లకు కారణం అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. జికా వైరస్ శరీరంలోకి ప్రవేశించాక.. మెదడు, వెన్నుపాము ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నాడీ సంబంధిత రుగ్మతలు ఏర్పడుతాయి. దీని వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని అరుదైన కేసుల్లో అయితే మెదడు లేదా నెర్వస్ సిస్టం కాంప్లికేషన్స్ కనిపిస్తాయని అంటున్నారు. అంటే Guillain-Barre syndrome లాంటి కాంప్లికేషన్స్ కూడా అరుదుగా కనిపిస్తాయి అని అన్నారు.

జికా వైరస్అయితే గర్భిణీలు ఎవరైతే జికా వైరస్ బారిన పడతారో.. వాళ్లలో ఎక్కువగా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అదే విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీకి జికా వైరస్ సోకితే బర్త్ డిఫెక్ట్స్ లాంటి సమస్యలు కలుగుతాయి అని చెప్పారు. అలాగే మైక్రోసెఫాలీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జికా వైరస్ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కి గురికాకుండా ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి. జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి. బాగా విశ్రాంతి తీసుకోవాలి. యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇత‌ర నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్ అంటే ఇబుప్రొఫెన్‌, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడ‌దు. డెంగ్యూ, జికా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలేవ‌ర‌కు ఈ మందుల‌ను వాడ‌కూడ‌దు. అలా వాడితే ర‌క్త‌స్రావం ప్ర‌మాదం ఉంటుంది. మ‌రేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న‌వారు కూడా డాక్ట‌రుని సంప్ర‌దించాకే మందులు వేసుకోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR