కరోనా వచ్చినప్పటి నుండి తెల్లారి లేస్తే ఏ కొత్త రోగం వస్తుందో తెలియక భయంతోనే జనాలు జీవనం సాగిస్తున్నారు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఈ జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి అనేవి… మనకు తరచూ వచ్చేవే. కానీ… ఈ కరోనా రోజుల్లో అలాంటివి వస్తే, మనలో టెన్షన్ పెరగడం సహజం. ఆస్పత్రులకు వెళ్లి టెస్టు చేయించుకుంటే, రిపోర్ట్ లో ఏం వినాల్సి వస్తుందో అనే భయం.
చాలా మంది బ్లాక్ టీ, గ్రీన్ టీ అని అనేక రకాల టీ ల గురించి విని ఉంటారు. కానీ వైట్ టీ గురించి చాలా మందికి తెలియదు. దీన్నే కమెల్లియా టీ అని పిలుస్తారు. కమెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని తయారు చేస్తారు. బ్లాక్, గ్రీన్ టీల్లో ఉండేంత కెఫైన్ కంటే…. ఇందులో తక్కువ కెఫైన్ ఉంటుంది. ఈ వైట్ టీలో కూడా ఇప్పుడు చాలా రకాలు వచ్చేశాయి.
ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైట్ టీని రోజూ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తప్పుతుంది. ఈ టీలో కెఫీన్, ఏజీసీజీ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల దీన్ని తాగితే శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువును తగ్గించుకోవచ్చు.
వైట్ టీలో ఫ్లోరైడ్స్ అధికంగా ఉంటాయి. అవి సూక్ష్మ క్రిములను చంపుతాయి. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో బాక్టీరియా నశిస్తుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే గుణాలు వైట్ టీలో ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వైట్ టీని రోజూ తాగుతుంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.
వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ఓ ఎముకల వ్యాధి. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారి విరిగిపోతుంటాయి. అయితే వైట్ టీలో ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ ఆస్టియోపోరోసిస్ సమస్యను తగ్గిస్తాయి. ఎముకలను బలంగా మారుస్తాయి.