కర్బూజ వలన కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా ?

0
237

చలికాలం పోగానే వేసవి వచ్చేస్తుంది. మండే ఎండలు తెచ్చేస్తుంది. ఇప్పుడు ఇందుకోసం ఎదురు చూసే వాళ్ళు వేసవి ఎండలకు అడుగు కూడా బయట పెట్టలేరు. వేసవి కాలంలో బయట ఉండే ఉష్ణోగ్రత ఆరోగ్యంతో పాటు చర్మానికి కూడా హానికరం. కర్బుజా తినడం వల్ల వేడి ప్రభావాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. దీనిని తినడం వల్ల వేసవి తాపానికి సహాయపడటమే కాకుండా, ఎండలో పోగొట్టుకున్న పోషకాలను పొందడంలో సహాయపడుతాయి. ఆరోగ్యానికే కాదు కర్బుజా చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందని తెలుసా.

benefits of Musk Melonవేసవిలో ఎదురయ్యే సన్ టానింగ్, ముడతలు, మచ్చలు మొదలైన వాటిని తొలగించడం ద్వారా మీకు మృదువైన, అందమైన ముఖాన్ని ఇస్తుంది. కర్బుజా పండులో విటమిన్ ఎ, డి, సి, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల చర్మ మరియు జుట్టు సంరక్షణకు సహాయపడతాయి. మంచి చర్మం పొందడానికి మీరు ఇంట్లోనే కర్బుజా ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం…

benefits of Musk Melonకర్బూజ పండు గుజ్జు ముఖానికి రాసుకుని 10 నిముషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది మరియు కొత్త కణాలు పెరగడానికి సహాయపడుతుంది.

benefits of Musk Melonకర్బూజ పండు గుజ్జులో ముల్తానిమట్టి కలిపి ముఖం, మెడకు అప్లై చేసి 20 నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ చర్మాన్ని తేమగా మార్చడానికి, అవసరమైన పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ముఖానికి తేమను అందిస్తుంది.

benefits of Musk Melonకర్బూజ పండులో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది చర్మానికి హాని కలిగించే మరియు క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కర్బూజ పండు గుజ్జు, తేనె కలిపి ముఖానికి రాసుకుని 10 నిముషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మం మృదువుగా మరియు ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

benefits of Musk Melonఎనిమిది చుక్కల లావెండర్ ఆయిల్ మరియు తేనె, కర్బూజ పండు గుజ్జు సమంగా తీసుకుని బాగా కలిపి దీనిని ముఖం, మెడ, చేతులపై రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.

 

SHARE