దేశీయ క్రాన్ బెర్రీస్ గా పిలవబడే కాయ తెలుసా

వాక్కాయల గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. దేశీయ క్రాన్ బెర్రీస్ గా పిలవబడే వాక్కాయను కలే చెట్టు, కరండ, కలే కాయలు, కలేక్కాయలు, కలివి కాయలు, అని కూడా అంటారు. వాక్కాయ మొక్కలు వృక్ష శాస్త్రీయ నామం కరిస్స కారాందాస్. ఇవి ఆంధ్రప్రదేశ్ లోని ఆన్ని ప్రాంతాల చిట్టడవులలో, కొండ ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతాయి.

3.vakkaya benefitsఈ మొక్కలనుండి పండ్లు వానకాలంలో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. చూడడానికి ద్రాక్షపళ్లకంటే చిన్నవిగా ఉండే ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళకు ఉపయోగిస్తారు. వాక్కాయ తో పులిహోర, మాంసం వాక్కాయ, వాక్కాయ పచ్చడి వంటి అనేక రకాల వంటలను తయారు చేస్తారు. వాక్కాయ పచ్చడి, వాక్కాయ పప్పు, వాక్కాయ పులిహోర ఇవన్నీ జిహ్వను లాలజలంలో తడిసిపోయేలా చేస్తాయి.

విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. కేవలం రుచికి కాదు అందులో గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాక్కాయలులో పెక్టిన్ అధికంగా వుండటం వలన, జామ్, జెల్లి తయారిలో ఉపయోగిస్తారు. కాయనుండి తీసిన స్రవం మధుమేహరోగనివారణిగా పనిచేస్తుంది. ఈ మొక్కలు ఇచ్చే పండ్లు మూత్రపిండాలలో రాళ్ళని కరిగించేవిగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి.

5.vakkaya benefitsవాక్కాయల రసంలో ఫైటో న్యూట్రియంట్స్, అంథోసైనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్, అధికంగా ఉన్నాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ పాలిఫినల్స్ వనల కణాలు దెబ్బతినకుండా ఇన్ఫెక్షన్లకు గురవకుండా రక్షిస్తుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఫైబర్ అధికంగా ఉన్న వాక్కాయ ఉదర సమస్యలకు చికిత్స చేయడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

1.vakkaya benefitsఎండిన పండ్ల పొడిని నీటితో కలిపి తీసుకొవచ్చు. ఇది కడుపుని తేలికపరుస్తుంది మరియు అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో పెక్టిన్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కరిగే ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది.

6.vakkaya benefitsవాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. సీజన్ లో దొరికే ఈ వాక్కాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్లు మరియు ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

4.vakkaya benefitsశరీరం డీహైడ్రేషన్ బారిన పడితే.. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరంలోని మంటను తగ్గిస్తుంది. వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది. ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది.

2.vakkaya benefits

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR