తిప్పతీగ… దీని హిందీలో గిలోయ్ అని , సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. ఇది చెట్ల మీదకు పాకీ అల్లుకుంటుంది. కాడలకు బొడిపెలు ఉంటాయి. ఆకులు చిన్నవిగా తమలపాకు సైజులో ఉంటాయి. సాధారణంగా పల్లెల్లో ఎక్కువ కనిపిస్తుంది.. కాస్త వగరు చేదు కారం రుచిని కలగలిపి ఉంటాయి దీని ఆకులు. నమిలితే జిగటగా ఉంటుంది. దీని విశేషం ఏమిటంటే పీకి పడేసిన తర్వాతకొంచెం తడి తగిలినా ఆరు నెలలైనా సరే తిరిగి బతుకుతుంది అని అంటారు పెద్దలు. తిప్పతీగను తులసిని కలిపి తీసుకుంటే స్వైన్ ఫ్లూని ఎదిరించే రోగనిరోధకశక్తి శరీరానికి చేకూరుతుంది. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చిన కూడా తగ్గించగలిగే దివ్య ఔషధం ఇది. తిప్పతీగ కాడలను 1 లేదా 2 అంగుళాల ముక్కను పది తులసి ఆకులతో కలిపి ఉదయాన్నే నమిలి తినాలి. ఇలా నాలుగైదు రోజులకొకసారి తీసుకోవాలి. వ్యాధి సోకినప్పుడు ఎక్కువ మోతాదులో తీసుకొంటే అద్భుతంగా పనిచేస్తుంది.
తిప్పతీగ వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. అలాగే ముఖంపై నల్లటి మచ్చలు మొటిమలు రాకుండా, అలాగే ముడతలు రాకుండా చేయగల గుణాలు ఈ తిప్పతీగ లో ఉన్నాయి.