దూసర తీగ వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ఉప‌యోగాలు

మన పూర్వికులు ప్రతీ సమస్యకు ఆయుర్వేదంలో ఔషధాన్ని కనుగొన్నారు. ఏ మూలికను, ఏ ఆకులు, ఏ వేరును.. ఏ సమస్యకు ఎలా ఉపయోగించాలో మన పూర్వీకులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఇంగ్లీష్ మందులు ఎక్కువగా రావటం, ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు తగ్గిపోవటంతో మన పురాతన వైద్యం కొంచం వెనుక పడింది కానీ, ఇప్పుడిప్పుడు మన భారతీయులు ఆయుర్వేదం వైపు మళ్లుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి.

Amazing Uses Of The Dosara Teeagaమన చుట్టూ ఉండే చాలా రకాల తీగలు, మొక్కలు ఆయుర్వేదంలో కీలకంగా పని చేస్తాయి. అందులో కొన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి దూసర తీగ గురించి ఎక్కువ‌గా తెలుస్తుంది. దీనిని తెలుగులో దూసర తీగ, సిబ్బి తీగ,చిపిరి తీగ అని పిలుస్తారు. సంసృతంలో పాపాల గరిడి అని కూడా పిలుస్తారు.. ఎక్కువగా పొలాల్లో దొరికే ఈ ఆకూ దొండ ఆకులూ మాదిరి ఉంటాయి.

Amazing Uses Of The Dosara Teeagaఈ మొక్క తీగలు పొద‌ల‌పై అల్లుకుంటాయి. దూసర తీగ‌ల‌ను ఇంట్లోనూ పెంచుకోవ‌చ్చు. ఈ మొక్కను సరైన పద్దతిలో వాడితే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలం పిల్లలు ఎండలో ఎక్కువగా ఉండటం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. దీనివల్ల మూత్రంలో మంట, ముక్కులోనుండి రక్తం కారడం జరుగుతుంది. పెద్దవారిలో కూడా బయట పని చేయడం, పొలాల్లో వ్యవసాయం చేసే వారికి ఎండ దెబ్బ తగిలి మలమూత్రంలో రక్తస్రావం జరుగుతుంది.

Amazing Uses Of The Dosara Teeagaఇలా జరగకుండా ఉండడానికి ఈ ఆకులను కొన్ని తీసుకొని శుభ్రంచేసి కొద్దిగా నీటిలో వేసి రసం వచ్చేవరకు నలపాలి. తర్వాత వ్యర్థాలను వేరుచేసి రసం తీసుకోవాలి. రసాన్ని పది నుండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ రసం గట్టిపడి జెల్ లా తయారవుతుంది. అందులో కొంచెం పటికబెల్లం కానీ తాటి తాటి బెల్లం కానీ కలిపి తినాలి. ఇలా తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు అయినా తగ్గిపోతాయి. దూస‌ర తీగ ఆకుల ర‌సాన్ని తీసి రోజూ తాగుతుంటే స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. సంతాన లోపం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. సంతానలేమి సమస్యలు ఉన్నవారు ఈ ఆకు రసం తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగి పోతాయి. నెలసరి సమస్యలు ఉన్నవారికి రెగ్యులర్ అయ్యేందుకు సహాయపడుతుంది. శరీర బరువు తగ్గి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ లేకుండా జరుగుతుంది.

Amazing Uses Of The Dosara Teeagaఈ ఆకు రసాన్ని 90 రోజుల వరకు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఎక్కువగా అందుబాటులో లేనివాళ్లు, ఈ ఆకులూ ఎప్పుడైనా దొరినప్పుడు, వాటిని నీటిలో కడిగి ఎండబెట్టి, వాటిని పొడిగా చేసుకొని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు. మోకాళ్ళు నొప్పులు, కీళ్లు నొప్పులు, చిన్న వయసులోనే అరికాళ్లలో మంటలు, ఉదయం నిద్ర లేచిన వెంటనే అడుగు వేయటానికి కూడా కొందరు ఇబ్బంది పడుతారు. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడడం జరుగుతుంది. అలాంటి వాళ్లందరికీ ఈ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఈ ఆకుల్లో కాల్షియం అనేది అధిక మోతాదులో ఉంటుంది. ఈ ఆకుల రసం తరచూ తీసుకోవడం వల్ల కాళ్లలోని ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి.

Amazing Uses Of The Dosara Teeagaసాధార‌ణంగా చాలా మందికి క‌ళ్ల మంట‌, కళ్ల దుర‌ద‌, కంటి రెప్ప‌ల‌పై కురుపులు ఏర్ప‌డుతుంటాయి. దీంతో చాలా ఇబ్బంది క‌లుగుతుంది. అలాంటి వారు దూసర తీగ‌ను బాగా దంచి ర‌సం తీసి ఆ ర‌సాన్ని క‌ను రెప్ప‌ల‌పై రాయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే గోరు వెచ్చ‌ని నీటితో క‌ళ్ల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారం పాటు చేస్తే అన్ని ర‌కాల కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Amazing Uses Of The Dosara Teeagaఈ ఆకుల కషాయాలను ఆడవారిలో గర్బాశయ సమస్యలు, ఇన్ఫెక్షన్లు తగ్గడానికి, గర్బం దాల్చలేకపోవడం వంటి సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ ఆకులను మెత్తగా నలిపి ఆ పసరు తీసుకోవడం వలన అనేక ఇన్ఫెక్షన్లు, గర్బాశయ సమస్యలు తగ్గుతాయి. గర్బం నిలబడుతుంది. రుతుస్రావం సమయంలో రక్తస్రావం నియంత్రణలో ఉంటుంది. కడుపు నొప్పికి చికిత్స చేయడానికి కూడా ఆయుర్వేదంలో ఈ ఆకుల కషాయం ఉపయోగిస్తారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR