చిన్న వయసులో జుట్టు తెల్లబడకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి ?

స్త్రీకైనా, పురుషులకైనా చిన్న వయసులో జుట్టు తెల్లబడటం అనేది పీడకల లాగానే ఉంటుంది. ఇలా జరగటానికి గల కారణమేమిటో తెలుసుకుంటే, అలా జరగకుండా నిరోధించవొచ్చు. మరి చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి గల కారణాలను తెలుసుకొని ఇలా జరగకుండా జాగ్రత్తలు పాటించండి.

e roju 2 pampinchandi broచెడు ఆహార అలవాట్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నసమతుల్య ఆహారం తీసుకోకపోవటం మీ ఆరోగ్యానికి మరియు మీ జుట్టుకు కూడా హాని చేస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల వలన మీరు అనేకరకాల వ్యాధుల చేత పీడింపబడతారు. దీనివలన మీ శరీరం, దంతాలు మరియు జుట్టు ప్రభావితం అవుతాయి.

విటమిన్ బి 12 దీర్ఘకాల లోపం:

hair bleachingముఖ్యంగా విటమిన్ బి 12 లోపం చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి కారణమవుతున్నది. కావున మీ ఆహారంలో తగినంత విటమిన్ బి 12 ఉండే పదార్థాలు ఉండేట్లుగా చూసుకోండి.

థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయకపోవటం:

hair bleachingథైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయక పోవటం వలన థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి సమస్యలు ఏర్పడటం వలన అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటం జరుగుతుంది. థైరాయిడ్ గ్రంధి పనిచేయకపోవడం మహిళల్లో సర్వసాధారణమైన విషయం. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీరు థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. సరైన మందులు మరియు చికిత్స తీసుకుంటే దీనిని నివారించవొచ్చు.

పియూష గ్రంధి లో సమస్యలు:

hair bleachingకొన్నిసార్లు థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయక పోవటం కారణంగా పీయూష గ్రంథిలో సమస్యలు ఏర్పడతాయి. అందువలన పిట్యుటరీ గ్రంధి కూడా పరోక్షంగా అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటానికి దోహదపడుతుంది.

దీర్ఘకాల మరియు అధిక ధూమపానం:

hair bleachingమనందరికీ తెలుసు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని, కాని మీ జుట్టుకు కూడా హానికరం. ధూమపానం, చిన్న వయసులో జుట్టు తెల్లబడటానికి ఒక కారణం. ‘ఘోరమైన’ పొగ నుండి దూరంగా ఉండండి.

కాలుష్యం:

hair bleachingఅందరికి పర్యావరణ కాలుష్యం చర్మానికి హాని చేస్తుందని తెలుసు, కాని అది జుట్టుకు చాలా హాని చేస్తుందని ఎవరికి తెలియదు. ఈ పర్యావరణ కాలుష్యం చర్మానికన్నా జుట్టుకు చేసే హాని ఎక్కువ.

జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం:

hair bleachingమీ జుట్టు చిన్న వయసులో తెల్లబడటానికి జుట్టు సంరక్షణ ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం ఒక కారణం. మీ జుట్టుకు హైడ్రోజన్ పెరాక్సైడ్ (ఉదాహరణకు రంగు రంగులు కోసం, జుట్టు బ్లీచింగ్ ఉత్పత్తులను, కొన్ని షామ్పూస్ మరియు కండిషనర్లు) కలిగిన ఉత్పత్తులను వాడటం మంచిది కాదు. ఏదైనా ఎక్కువగా వాడటం చెడు చేస్తుందని గుర్తుంచుకోండి. కాబట్టి కొన్నిటిని నియంత్రించండి మరియు సాధ్యమైనంతవరకు సహజంగా ఉండండి.

ఒత్తిడి:

hair bleachingమీరు ఒత్తిడికి మరియు ఎల్లప్పుడూ ఆందోళనకు గురవుతున్నారా? మీరు దీర్ఘకాలిక మరియు భయంకరమైన ఒత్తిడితో కూడిన జీవితంతో బాధ పడుతున్నారా? ఇటువంటి జీవిత విధానం వలన మీ జుట్టు ప్రభావితం అవుతున్నది. అందువలన విశ్రాంతిగా ఉండండి.

దంతాలు తెల్లబరిచే ఉత్పత్తులను అధికంగా ఉపయోగించటం:

hair bleachingదంతాలు తెల్లబరిచే ఉత్పత్తులలో అధికంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడటం వలన జుట్టు తెల్లబడుతుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ మీ శరీరంలో ఎక్కువగా ఉండటం వలన, మీ జుట్టుకు రంగు ఇచ్చే ఎంజైమ్ల మీద ప్రతికూల ప్రభావాన్నిచూపుతుంది. కావున మీరు ఏ ఉత్పత్తిని వాడేముందు డాక్టర్/దంతవైద్యుడిని సంప్రదించండి.

జన్యువుల అమరిక:

hair bleachingచివరిగా జన్యువులను కారణంగా తీసుకోవొచ్చు. దీని గురించి మీరు చేయగలిగేది ఏమి లేదు. కొంతమందికి ఈ అపరిపక్వ దశలో జుట్టు తెల్లబడటం అనేది జన్యుపరంగా ఏర్పడవొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR