జంక్ ఫుడ్ వలన ఎదురయ్యే సమస్యలలో ఇప్పుడు చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య ఒకటి దంతాలు పసుపు రంగులో ఉండటం. దీనివల్ల నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. మాములుగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడమే.
దీనికి చాలా మంది ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తారు…అందులో ఒకటి నిమ్మరసం మరియు బేకింగ్ సోడా, దానివల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి. కానీ ఇవి మన దంతాలకు హాని చేస్తాయని చాలా మందికి తెలియదు.
నిమ్మరసం మరియు బేకింగ్ సోడా వాడటం వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. అయితే అదే సమయంలో దంతాల్లో దంతాల సెన్సివిటి కూడా పెరుగుతుందనే సంగతి ఎవరికీ తెలియదు. దీనివల్ల దంత క్షయానాకి గురి చేస్తుంది.
కాబట్టి దంతాలు మెరవడానికి నిమ్మరసం, బేకింగ్ సోడా లాంటివి వాడే ప్రతీ ఒక్కరు దంతాలపై ఎనామిల్ తగ్గిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. వీలైనంత వరకు ఇలాంటి వాటికి దూరంగానే ఉండడం ఉత్తమం.