Home Health పన్నీరుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

పన్నీరుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

0

వెజ్ మాత్రమే తినేవారికి నాన్ వెజ్ కి ప్రత్యామ్నాయం పన్నీరు. మాంసాహారంలో ఉండే పోషకాలు పన్నీరులో ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇండియన్స్ ఎక్కువగా వాడే పన్నీరుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

health benefits of cheeseపన్నీరు గుండెకు ఎంతో మంచిది, రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. పన్నీర్‌లో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేస్తుంది, జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది. కాన్సర్లలో ఎక్కువ మందికి సోకుతున్న రొమ్ము క్యాన్సర్ నుంచీ పన్నీర్ మనల్ని కాపాడుతుంది. పాల ఉత్పత్తి అయిన పన్నీర్‌లో ఉండే కాల్షియం, విటమిన్ డి, రొమ్ము కాన్సర్‌ను దూరం చేస్తాయి.

పన్నీర్ బాడీలోని వివిధ రకాల ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తుంది. కండరాలు మరియు నాడుల పనితీరు నిర్వహిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పన్నీర్‌లో ఉండే ఎక్కువగా ఉండే ప్రోటీన్‌లు శాఖాహారులకు శక్తినిస్తాయి. పన్నీరులో ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచి… మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసి, వాటిని వెలికి తీయడానికి సహాయపడతాయి.

పన్నీర్ ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మనకు రోజూ అవసరమయ్యే కాల్షియంలో 8% దీని ద్వారా లభిస్తుంది. ఇది పిల్లలు, పెద్దల్లో ఎముకలు పటిష్టంగా ఉండేలా చేస్తుంది. గర్భవతులైన మహిళలకు అత్యుత్తమైన ఆహారం పన్నీరు.

పన్నీర్‌లో ఉండే జింక్‌ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికీ, జీర్ణక్రియకు, షుగర్‌ని కంట్రోల్ చెయ్యడానికీ, టెన్షన్లను తట్టుకోవడానికీ ఉపయోగపడుతుంది. సెలీనియం ఎక్కువగా ఉండే పన్నీరును వంటల్లో వేసుకొని తినడం వల్ల… మన శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఉంటాయి. అలాగే రకరకాల వ్యాధుల నుంచీ తప్పించుకోవచ్చు.

అంతేకాదు ఇది రేచీకటిని నిరోధిస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడాన్ని నిరోధిస్తుంది. అలాగే ప్రొస్టేట్‌ రుగ్మతలను పోగొట్టి, వివిధ రకాల అంటువ్యాధులకు విరుద్ధంగా పోరాడుతుంది.

 

Exit mobile version