హిందు, ముస్లింలు కులమతాలక తీతంగా ప్రత్యేక పూజలు చేసే పుణ్యస్థలం

0
7665

ఇక్కడ ఒక కొండ పైన కోట ఉన్నది. దానినే కోయిల కొండ అని పిలుస్తుంటారు. అయితే ఈ ప్రదేశంలో లెక్కలేనన్ని ఆలయాలు ఉండడంతో ఈ ప్రాంతాన్ని మొదట్లో కోవెలల కొండ గా పిలిచేవారు. అదే కాలక్రమేణా కోయలకొండ గా మారిందని చెబుతారు. మరి కోయల కొండ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న కోట విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

koyalakondaతెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, కోయలకొండ అనే గ్రామంలో ఒక కొండపైన చాల పురాతనమైన కోటతో పాటు అనేక పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన క్రీ.శ 1521నాటి శాసనం ప్రకారం ఈ కోట కాకతీయులకాలంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది. కోటలోని చారిత్రక నిర్మాణాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి.

koyalakondaఅయితే పెద్దపెద్ద బండరాళ్లతో నిర్మించిన బురుజులు, అలనాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోట చుట్టూ నిర్మించిన రాతి గోడ, కోటలోపల వంగిపోయే దారులు నాటి కళానైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. ఇంకా గుర్రాలను కట్టేసేందుకు ఏర్పాటు చేసిన అశ్వశాల సైతం నేటికీ అలాగే ఉంది. కోట లోపలిభాగాన దాదాపు పదుల సంఖ్యలో ఉన్న చెరువులు, చిన్నచిన్న కుంటలు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి ఎప్పటికీ నీటితో కళకళలాడుతుంటాయి. వీటికితోడు కోటలో ధాన్యరాశులు నిల్వ ఉంచేందుకు భవంతులు ఉన్నాయి. వీటిల్లో నెయ్యి, వడ్లు, గంధం ఉత్పత్తులను నిల్వ చేసేవారని తెలుస్తోంది. కోట మధ్య భాగంలో రాణి మందిరం, ఆమె స్నానం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలను ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఇక కోట పైభాగంలో బాల ఇసార్ విశేషంగా ఆకట్టుకుంటుంది.

koyalakondaఇంకా ఇక్కడి విశేషం ఏంటంటే, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా జరగనంత ఆర్భాటంగా ఇక్కడ మొహర్రం వేడుకలను నిర్వహిస్తారు. కోటలోనే పీర్ల చావిడి కూడా ఏర్పాటు చేశారు. మొహర్రం సందర్భంగా బీఫాతిమా పీరీని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ పీరీకి హిందు, ముస్లింలు కులమతాలక తీతంగా ప్రత్యేక పూజలు చేస్తారు. వేడుకల సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన రజీ వంశస్థులు నల్ల దుస్తులతో కోయలకొండ కోటకు వస్తారు. బీఫాతిమాను శరణు కోరుతూ తమ గుండెలు బాదుకుంటూ రోదిస్తూ ప్రార్థనలు చేయడం అనాదిగా వస్తున్నది. వేడుకలు ముగిశాక బీఫాతిమా పీరీని కోటలోని ఓ ప్రత్యేక గదిలో భద్రపరుస్తారు.

koyalakondaఇంతటి గొప్పటి ప్రాచీన చరిత్ర కలిగిన ఈ కోట గురించి ఇప్పటికి చాలా మందికి తెలియకపోవడం గమనార్హం అని చెప్పవచ్చు.

koyalakonda