ఆషాడ మాసంలో గోరింట తప్పక పెట్టుకోవాలని ఎందుకంటారు ?

గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ళూ అందరూ పెట్టుకోవాలని అనుకుంటారు.. అందులోను ఆషాడం లో గోరింటాకుని ప్రత్యేకించి మరీ పెట్టుకుంటామ్. గోరింటాకు మనకి సంవత్సరం పొడవునా అయినా ఆషాఢ మాసములో పెట్టుకుంటే ప్రత్యేకం.. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుళ్లుఈ ఆషాఢ మాసములో అత్తవారింటి నుండి పుట్టింటికి వెళతారు… అలా పుట్టింట్లో చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసి పోతుంటారు.. ఇక పెళ్లికాని వారికైతే చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడు అని అంటారు.. అయితే ఆషాడ మాసంలో గోరింట తప్పక పెట్టుకోవాలని ఎందుకంటారు.. అసలు గోరింటాకు కథ ఏంటి మనం ఇపుడు తెల్సుకుందాం..

Gorintakuగోరింటాకు అంటే పార్వతి అమ్మవారికి చాలా ఇష్టమంట.. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీ దేవి బాల్యములో చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉన్న సమయములో రజస్వల అవుతుంది… అయితే ఆ రక్తపు చుక్క నేలకు తాకగానే ఓ మొక్క పుట్టింది. ఈ వింత గురించి చెలికత్తెలు చెప్పగా పర్వత రాజు సతీ సమేతముగా చూసేందుకు వస్తాడు… ఆ కొద్దీ సమయంలోనే ఆ చెట్టు పెద్దది అయి తానూ సాక్షాత్తు పార్వతిదేవి రుధిర అంశతో జన్మించానని, నా వలన లోకానికి ఉపయోగం కలుగుతుంది అని చెప్తుంది.. అంతలోనే చిన్నతనం పోని పార్వతీదేవి చాపలత్వంతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది… అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి . అది చూసి అయ్యో బిడ్డ చేతులకేమైంది అని కంగారుపడతారు పార్వతి దేవి తల్లితండ్రులు.. అయితే తనకు ఏవిధమైన బాధ లేదని, పైగా ఇలా ఎర్రగా అలంకారంగా ఉందని అంటుంది పార్వతి.. రజస్వల సమయాన ఉద్భవించినది కాబట్టి స్త్రీల గర్భాశయ దోషములను, అతి వేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, ఎర్రగా చేతులకు, కాళ్లకు అందాన్నిచ్చేఅలంకార వస్తువుగా వాడబడుతుంది అని ఆశీర్వదిస్తారు పర్వతరాజు.

Gorintakuఅప్పటి నుండి స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు ప్రసిద్ధం అయింది.. అయితే అరచేతుల్లో పండే గోరింటాకు నుదుటున మాత్రం పండదు.. ఎందుకంటే.. గోరింటాకు చెట్టు ఉద్భవం గురించి తెల్సిన కుంకుమ గౌరీదేవి దగ్గరకు వచ్చి, ఇక అందరు నుదుటన కూడా ఈ ఆకుతోనే బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని చెప్పి బాధ పడ్తుంది.. అప్పుడు గౌరీ దేవి ఈ ఆకు నుదుటన పండదు అని చెప్తుంది…ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది.. మన అరచేతుల మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి. వాటిలోని అతి ఉష్ట్నాన్ని తగ్గిస్తుంది గోరింటాకు. ఇలా గోరింటాకు పండడం అనేది స్త్రీల ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

Gorintakuఅంతే కాదు శాస్త్రీయ పరంగా చూస్తే ఆషాఢ మాసము వర్షాకాలం. తరచూ తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్లు, ఫంగస్ లాంటి వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR