పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు అనే పెద్ద శివలింగం కలదు. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటిది ఏది లేదు. అతిపెద్ద ఈ శివలింగం గర్భగుడిలో ఎప్పుడు ఎండ తాకిడిని నిలిచి పైకప్పు లేదు కాబట్టి ఎప్పుడు ఎండలోనే ఉంటుంది. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పిలుస్తారు.ఈ ఆలయంలోని శివలింగం ఎత్తు సుమారు 20 అడుగులు. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం పక్కనే మరొక చిన్న శివలింగం ఉంది. ఈ లింగానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా లంక నుండి అయోధ్యకు వెళుతూ రావివలసలోని శివుడిని పూజించినట్లు ప్రతీతి. ఈ గుడిపక్కన ఉన్న కొలనును సీతాకుండం అంటారు. ఇందులో స్నానం ఆచరించి ఆ శివలింగాన్ని దర్శించి శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమంతులతో కలసి పూజించి వెళ్లారట.ఆ తరువాత ద్వాపరయుగంలో పాండవులు తమ అజ్ఞాత వాసంలో కొంతకాలం ఈ శివలింగాన్ని పూజించినట్లు తెలుస్తుంది. ఇక 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు ఈ మల్లికార్జున స్వామికి ఆలయం నిర్మించగా అది కూలిపోయింది. ఆ తరువాత మరల ఆలయ నిర్మాణ పనులు ప్రయత్నిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం వద్దు ఎండలో ఎండి వానలో తడవడమే నా అభిష్టం, ఆ విదంగానే నేను భక్తులకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పాడట. అప్పటినుండి ఈ స్వామి ఎండల మల్లికార్జునుడు అని ప్రసిద్ధి చెందాడు.ఈ రావివలస గ్రామం కార్తీక కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కార్తీకమాసంలో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. లోకకల్యాణార్థం కార్తీకమాసంలో ఈ మల్లికార్జునుడు రావివలసలో అశ్వత్థ వృక్షం కిందవుంటాడని భక్తుల నమ్మకం. అందువల్లనే రావివలస కార్తీక కైలాసంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.