యూకలిప్టస్ ఆయిల్ తో ఆయుర్వేద వైద్యం!

ప్రకృతిలో చెట్లు, వివిధ రోగాల నయం చేసే మొక్కలు ఉన్నాయి. అందులో ఒకటి యూకలిప్టస్. ఇది చాలాకాలంగా ఆయుర్వేద మోనోలేయర్‌గా ఉపయోగించబడుతుంది. ఆస్ట్రేలియాకు చెందిన యూకలిప్టస్ ఈ రోజు చాలా చోట్ల కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో అనేక యూకలిప్టస్ చెట్లు పెరుగుతున్నాయి. యూకలిప్టస్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.

eucalyptusనీలగిరి కొండలలో పెరగటం వల్ల ఈ చెట్లకు ఆ పేరు వచ్చింది. ఈ చెట్టు ఆకులను నలిపితే జండుబామ్ మాదిరిగా ఘాటైన వాసన వస్తుంది. జిందా తిలిస్మాత్, జండూబామ్, టైగర్ బామ్, అమృతాంజన్, విక్స్ వంటి వాటిలో నీలగిరి తైలాన్ని ఉపయోగిస్తారు. అలాగే మందుల తయారీలో, సుగంధ ద్రవ్యాల తయారీలో, పారిశ్రామికంగా ఈ నూనెను ఉపయోగిస్తారు.

eucalyptus oilఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది మంచి క్రిమినాశక మందుగా కూడా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్ ను తలనొప్పి, ఇన్ఫెక్షన్లను నివారించడానికి, కండరాల నొప్పి నుండి ఉపశమనం, ఆస్తమాను తగ్గించేందుకు ఉపయోగించవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం, యూకలిప్టస్ ఆయిల్ బ్యాక్టీరియా, వైరస్ లను తొలగించడానికి సహాయపడుతుంది.

muscle painఈ నూనెను యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు. గాయాలు, కోతలు, కాలిన గాయాలు, అప్పుడప్పుడు పురుగుల కాటు వంటి సమస్యలకు ఈ నూనె ఉపయోగకరంగా ఉంటుంది. ఇది బొబ్బలు, కోతలు, పూతలు, గాయాలు, పుండ్లు, పురుగుల కాటు, గజ్జి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది కండరాలలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పిని వదిలించుకోవడానికి ఈ నూనె రెండు చుక్కలను నుదుటిపై అప్లై చేసి, తేలికపాటిగా చేతులతో మసాజ్ చేయాలి.

foreheadయూకలిప్టస్ ఆయిల్ దగ్గుకు అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమైన నూనెలలో ఒకటి. ఇది దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. సూక్ష్మజీవులు, టాక్సిన్‌లను తొలగిస్తుంది. మీకు జలుబు ఉంటే ఈ నూనె మీకు సులభంగా శ్వాస తీసుకునేందుకు కూడా సహాయపడుతుంది. యూకలిప్టస్ నూనె శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), బ్రోంకైటిస్, సైనసిటిస్, ఆస్తమాలను తగ్గిస్తుంది. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా చేస్తాయి. శ్వాసను మెరుగుపరుస్తాయి.

coughమడమ నొప్పి వచ్చి నడవలేకపోతుంటే ఆ ప్రాంతంలో నీలగిరి తైలంతో బాగా మసాజ్‌ చేయాలి. ఒళ్ళు నొప్పులుగా ఉంటే, స్నానం చేసే నీటిలో ఏడెనిమిది చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి స్నానం చేస్తే నొప్పులన్నీ తగ్గిపోతాయి. గోరువెచ్చని నీటిలో మూడు, నాలుగు చుక్కల నీలగిరి తైలాన్ని కలిపి త్రాగినట్లయితే అజీర్ణం, అజీర్తి విరేచనాలు తగ్గుతాయి. నిత్యం ఆహారంలో నీల‌గిరి తైలం చేర్చి తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

heel painనీల‌గిరి తైలంలో యాంటీ డ‌యాబెటిక్ గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ తైలాన్ని నిత్యం తీసుకుంటే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని పరిశోధనల్లో తేలిందని అంటున్నారు. పిప్పి పన్నుతో చెంపవాచి బాధ కలుగుతున్నప్పుడు, చెంప మీద యూకలిప్టస్‌ ఆయిల్‌ను రాస్తే నొప్పి తగ్గుతుంది.
దంతాలు తోముకునే పేస్టులో యూక‌లిప్ట‌స్ ఆయిల్‌ను క‌లిపి దంతాల‌ను తోముకుంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. దంతాల‌పై ఉండే గార‌, పాచి పోతాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు త‌ళ‌త‌ళా మెరుస్తాయి.

teeth whiteningనడుము నొప్పితో బాధపడేవారు నీలగిరి తైలాన్ని వేడినీటిలో కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితే నొప్పి తగ్గుతుంది. నీలగిరి తైలం వాడకం వల్ల చర్మానికి ఎటువంటి ఎలర్జీలు ఏర్పడవు. మొటిమ‌ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు వాటిపై నిత్యం రెండు పూటలా కొద్దిగా నీలగిరి తైలాన్ని రాయాలి. దీంతో అతి త‌క్కువ స‌మ‌యంలోనే మొటిమ‌ల సమస్య తొలగిపోతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇత‌ర మ‌చ్చ‌లు కూడా పోతాయి.

acneదుస్తులు ఉతికేట‌ప్పుడు కొద్దిగా నీల‌గిరి తైలం వేసి వాటిని ఉత‌కాలి. దీంతో దుస్తుల‌కు ప‌ట్టి ఉండే ఫంగ‌స్‌, ఇత‌ర క్రిములు నశిస్తాయి. దీనివ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. అలాగే బెడ్‌షీట్లు, దిండు క‌వ‌ర్లు త‌దిత‌ర ఇత‌ర వ‌స్త్రాల‌పై కూడా నీల‌గిరి తైలం చ‌ల్లుతుంటే అవి సువాస‌న వ‌స్తాయి. అంతేకాకుండా క్రిములు రాకుండా ఉంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR