జుట్టు రాలే సమస్య తగ్గించే పోషకాలు ఉన్న బ్యాలెన్స్‌‌డ్ ఫుడ్ ఏంటో తెలుసా

కొవిడ్ నుంచి కోలుకున్నాక చాలామంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న వారిలో దుష్ప్రభావాలు కొన్ని నెలల వరకు కొనసాగుతున్నాయి. దీన్ని లాంగ్ కోవిడ్ అని పిలుస్తున్నారు. లాంగ్ కోవిడ్ ఐదు ప్రధాన లక్షణాల్లో జుట్టు రాలిపోవడం ఒకటని పరిశోధకులు తెలిపారు. మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.

జుట్టు రాలే సమస్యమానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్న విషయం తెలిసిందే. ఈ వైరస్‌ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవాళ్లలో ఎక్కువ జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ కరోనా వైరస్ వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది లాంగ్ కోవిడ్ లక్షణంగా మారుతోంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో పావు వంతు మందిలో జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువ అవుతోందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది.

జుట్టు రాలే సమస్యజుట్టు రాలిపోవడంతోపాటు అలసట, కండరాల బలహీనత, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి లక్షణాలు కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. తీవ్రమైన వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నవారు, ఎక్కువ రోజులు చికిత్స తీసుకొని కోలుకున్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపించడం విశేషం. కరోనా నుంచి కోలుకున్నవారిలో జుట్టు రాలిపోయే సమస్య 22 శాతం, నిద్ర సంబంధ సమస్యలు 26 శాతం, ఒత్తిడి, ఆందోళన వంటివి 23 శాతం మందిలో కనిపించాయని ఈ నివేదిక పేర్కొంది.

జుట్టు రాలే సమస్యఅయితే ఒత్తిడిని తగ్గించుకుని సమతుల ఆహారం తీసుకుంటే జుట్టు రాలే సమస్యనుంచి త్వరగా బయటపడొచ్చు. ఈ సమస్యను తగ్గించే పోషకాలు ఉన్న బ్యాలెన్స్‌‌డ్ ఫుడ్ ఏంటో తెలుసుకుందాం….

కొబ్బరినూనె

జుట్టు రాలే సమస్యఒక టేబుల్‌ స్పూన్‌ స్వచ్ఛమైన కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవాలి. ఆయిల్ మసాజ్ ఎక్కువగా చేయాలి. కోకోనట్ ఆయిల్ వెంట్రుకలు దెబ్బతినకుండా కాపాడుతుంది. వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

బాదం

జుట్టు రాలే సమస్యరోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్‌నట్స్‌ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కేశాల పెరుగుదలకు తోడ్పడటంతోపాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. అంతేకాకుండా కుదుళ్లకు పోషకాలు అంది హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది.

వాల్‌నట్స్‌

జుట్టు రాలే సమస్యవాల్నట్స్ లోని పొటాషియం, ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పోషణనిస్తాయి. వాల్‌నట్స్‌లోని పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.

గుడ్లు

జుట్టు రాలే సమస్యప్రొటీన్ కోసం రోజూ గుడ్డు తినాలి. రోజూ మూడు గుడ్ల తెల్లసొన, ఒక గుడ్డు పచ్చసొన ఆహారంలో చేర్చుకోవాలి. తెల్ల సొన మాడును శుభ్ర పరుస్తుంది. పచ్చ సొనలోని విటమిన్స్‌, మినరల్స్‌ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

చియా

జుట్టు రాలే సమస్యఈ మూడు గింజలనూ ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్‌ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.

అవిసె గింజలు

జుట్టు రాలే సమస్యఅవిసె గింజల్లో ఉండే విటమిన్ ఇ చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుమ్మడి గింజలు

జుట్టు రాలే సమస్యగుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో ‘విటమిన్‌-ఇ’ అపారం. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR