నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ భూమిని దేవభూమి అని ఎందుకు అంటారు.

0
3027

ఉత్తరాంచల్ రాష్ట్రం అనగానే మనకి చార్ ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. చార్ ధామ్ అంటే నాలుగు పుణ్యక్షేత్రాలు అని అర్ధం. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాద్, బదరీనాధ్. ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ భూమిని దేవభూమి అని అంటారు. ఇక చార్ ధామ్ యాత్ర అనేది యమునోత్రి తో మొదలై భారీనాధ్ తో ముగిస్తుంది. అయితే ఇక్కడే సముద్రమట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఒక స్థలంలో ద్రౌపతి ప్రాణత్యాగం చేసుకుందని చెబుతారు. మరి ఆ స్థలం ఎక్కడ ఉంది? అక్కడ దాగి ఉన్న విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mahabharatham

ఉత్తరాంచల్ రాష్ట్రంలోని బదరీనాథ్ నుండి మంచు కొండల్లో సుమారు 9 కీ.మీ. కాలినడక ప్రయాణం చేయగా సముద్రతీరానికి దాదాపుగా 10,800 అడుగుల ఎత్తులో లక్ష్మివన్ అనే ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడే ద్రౌపతి ప్రాణ త్యాగం చేసిన స్థలంగా చెప్తారు. అయితే ఇక్కడి నుండి ప్రయాణం సాగిపోతూ ఉంటె సహస్రధారగా వేలాది జలపాతాలు సందడి చేస్తాయి.

Mahabharatham

ఇక్కడి ప్రదేశం నుండి అలానే వెళితే చక్రతీర్ద్ అనే ప్రదేశం వస్తుంది. అయితే సంవత్సరంలో జులై, ఆగస్టు నెలలో మాత్రమే ఇక్కడ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక్కడి క్షేత్రంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చక్రప్రయోగా విద్యను నేర్పించాడని తెలుస్తుంది. ఈ ప్రదేశంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక తొమ్మిది మంది మాత్రమే నిద్రించగల ఒక గుహ ఉంటుంది. ఇక్కడి నుండి రెండు గంటల పాటు ప్రయాణం చేస్తే సాతోపంథాల్ వస్తుంది. ఇది సత్యానికి దగ్గరైన స్థలంగా చెబుతారు.

Mahabharatham

ఈ ప్రాంతం నుండి మరొక నాలుగు గంటలు నడిచి ప్రయాణం చేస్తే స్వర్గారోహణ్ ప్రాంతం వస్తుంది. మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలోని అంతిమఘట్టం ఇక్కడే జరిగిందని చెబుతారు.

ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఈ ప్రదేశాలను దర్శించడం చాలా కష్టంతో కూడుకున్నది.