గడ్డం ఫ్యాషన్ మాత్రమే కాదు ఆరోగ్యం కూడా!

ఒకప్పుడు ఋషులు, మునులు గడ్డంతో కనిపించేవారు. ఆ తరువాత జనరేషన్ మారి గడ్డంతో కనిపించే వారిని చూస్తే ప్రేమలో ఫెయిల్ అయ్యారనో, జీవితంలో దెబ్బతిన్నారనో అనుకునేవారు. కానీ భూమి గుండ్రంగా తిరుగుతున్నట్టే ఎక్కడ మొదలయ్యామో అక్కడికే చేరుకున్నాము. ప్రస్తుత సమాజంలో, అబ్బాయిలకు గడ్డం ఉండడమే ఫ్యాషన్. ప్రస్తుతం చాలామంది ఫ్యాషన్ లో ఉన్నా.. లేకపోయినా వారి ధోరణి బట్టి గడ్డం పెంచుతున్నారు.

chris evans with beardఇక నేటి తరం సెలబ్రిటీలు.. అంటే సినిమా వారే కావొచ్చు, లేదా క్రీడా రంగంలో వారైన ఉండొచ్చు.. వీళ్ళు గడ్డం పెంచుకుంటే.. సమాజంలో యువత కూడా వారిని ఫాలో అయిపోయి గడ్డం పెంచుతున్నారు. కొంతమంది ఆఫీస్ రూల్స్ ప్రకారం స్మార్ట్ గా షేవ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆఫీస్ లలో కూడా చాలా వరకు ఉద్యోగులు గడ్డంతో దర్శనమిస్తున్నారు. ఇక లాక్ డౌన్ వలన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలామంది షేవింగ్ చేయించుకోవడం మీద ఆసక్తి చూపించట్లేదు.

clean shaveఅయితే.. ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. గడ్డం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి.
గడ్డం పెంచుకోవడం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి నుంచి విడుదలయ్యే రేడియేషన్ కిరణాలు నేరుగా ముఖంపై పడవని దీనివల్ల చర్మం నల్లగా మారడం, సూర్యరశ్మి తగిలి కమిలిపోవడం వంటి సమస్యలు రావు.

uv rays for skinముడతలు కూడా రావు..యూవీ కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. గడ్డం చర్మ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది. సూర్యరశ్మి ద్వారా వచ్చే 95 శాతం అతినీలోలహిత కిరణాలు ముఖంపై పడకుండా గడ్డం అడ్డుకుంటున్నట్లు పరిశోధనలో తేలింది. అతినీలలోహిత కిరణాలతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. తద్వారా గడ్డం ,చర్మ క్యాన్సర్ నుండి కూడా రక్షణను ఇస్తుంది.

గడ్డం ఉంటే చర్మానికి మంచి మాయిశ్చరైజ్ కలిగి ఉండి, యంగ్ గా… స్మార్ట్ గా కూడా కనిపిస్తారు. గడ్డం పెంచుకోవడం వలన అనేక చర్మ సంబందిత వ్యాధులు నుంచి దూరం కావొచ్చని తాజా పరిశోధనలో వెల్లడైంది. గడ్డం ని క్లీన్ గా షేవ్ చేసుకున్న ప్రతిసారి, చర్మం మాయిశ్చరైజేషన్ కోల్పోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇక బ్యాక్తీరియాతో ఇన్ఫెక్షన్లు, మొటిమలు వస్తాయి. గడ్డం ఉంటె ఈ సమస్యలు రావు, అలానే ముఖంపైన వచ్చే మచ్చలు కూడా చాలవరకు తగ్గిపోతాయి.

pimples on faceరెగ్యులర్‌గా షేవింగ్ చేయడం వల్ల ముఖంపై రేజర్ తెగినగాట్లు పడే అవకాశం ఉంది. అందుకే గడ్డం పెంచితే ఈ బాధేమీ ఉండదు. గడ్డం పెంచడం వల్ల పొడి చర్మం సమస్య నుంచి బయటపడొచ్చు. గడ్డం పెంచినప్పుడు సెబాసియస్ (కొవ్వు) గ్రంథులు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో గడ్డం ఎంతో తోడ్పడుతుంది. చలి పెరిగేకొద్దీ, గాలికి గురయ్యే చర్మం మరింత చల్లగా మారుతుంది. అయితే గడ్డం ఉండటం కారణంగా ఈ బాగం వేడెక్కి, రక్షణగా ఉంటుంది.

ఆస్తమా, గొంతు ఇన్ఫెక్షన్స్ కి అనేక కారణాలలో బ్యాక్టీరియా ఒకటి.. అయితే ఈ బ్యాక్టీరియా, టాక్సిన్స్ లోపలికి వెళ్ళకుండా గడ్డం నిరోధిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. గడ్డం ఉన్న అబ్బాయిలు అమ్మాయిలను ఎక్కువగా ఆకట్టుకుంటారనేది మరో ఎత్తు. గడ్డం వల్ల మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తారని అమ్మాయిలు ఎక్కువగా కాంప్లిమెంట్స్ ఇస్తారట. గడ్డం పెంచుకోవడం వల్ల వాళ్లు చాలా స్మార్ట్ గా ఉన్నట్లు కాంప్లిమెంట్స్ పొందుతున్నారట. దానివల్ల అది అబ్బాయిలను కాన్ఫిడెంట్ గా ఉండేలా చేస్తుందట.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR