Home Health మునక్కాయలు వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయా ?

మునక్కాయలు వలన లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయా ?

0
Benefits And Disadvantages Of Drumstic

ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతాల్లో పుట్టిన మునగ చెట్టు మానవాళికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మునగకాయ రుచికి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందజేస్తుంది. కేవలం కాయలే కాదు..చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగలో ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. మునగ కాయలే కాకుండా మునగ ఆకులను కూడా ఆహారంగా తీసుకోవచ్చు. చాలా బలం కూడా. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది.

గర్భిణులు మునక్కాయను ఎక్కువగా తినడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల బాధ తగ్గుతుంది. ప్రసవం తర్వాత వచ్చే చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. తల్లిపాలు వృద్ధి అవుతాయి. డయోరియా, డైసెంట్రీ, జాండీస్, కలర్ వంటి వాటికి మంచి విరుగుడు.

మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మునగాకులో మెండైన ఔషధగుణాలుండుట వల్ల తేనె, కొబ్బరినీళ్ళతో తీసుకోవడం వల్ల కడుపుకు సంబంధించిన అనాగోగ్యసమస్యలను దూరం చేస్తుంది.

మునగకాయ రసం, కీళ్లనొప్పుల నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మరియు క్యాల్షియం అందుకు బాగా దోహదం చేస్తుంది. మునగ పువ్వులు, చిగుర్లు కూరగా వండుకుని తింటే కీళ్ళ జబ్బులు రావు. రక్తహీనత తగ్గి, హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే మునగకాయ వలన కొన్ని నష్టాలూ కూడా ఉన్నాయని చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

మునగకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది శరీరానికి అవసరమే కానీ మోతాదుకు మించి తినడం చాలా ప్రమాదకరం. ఫైబర్ శరీరానికి కావాల్సిన దాని కన్నా ఎక్కువగా తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. అతిసారం సమస్య వస్తుంది. మలబద్ధకం సమస్య వస్తుంది. పేగులకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. మునగకాయను ఎక్కువగా తీసుకుంటే.. అలెర్జీలు వస్తాయట.

మునక్కాయలో ఉండే కొన్ని రసాయనాలు అలెర్జీలను కలిగిస్తాయట. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు. ఈ అలెర్జీలకు గురవుతారట. దాని వల్ల చర్మం ఎర్రబారడం, చర్మం పై పొర ఊడిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. అలాగే అధిక రక్తపోటు కూడా వచ్చే సమస్యలు ఉంటాయి.

మునగకాయ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దాని వల్ల.. హైపోక్సేమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలన్నా.. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఖచ్చితంగా మునగను ఎక్కువగా తీసుకోవద్దు. పరిమితంగానే తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా మునక్కాయను మితంగా తీసుకోవడం మంచిది.

 

Exit mobile version