Home Health ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు

ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు

0
ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కలిగే నష్టాలు

ప్రోటీన్ ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు సహయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని చాలా మంది నమ్ముతుంటారు. చిక్కుళ్లు, విత్తనాలు, పౌల్ట్రీ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని బరువు తగ్గేందుకు తీసుకుంటుంటారు. ప్రోటీన్స్ మన చర్మం, జుట్టుకి కూడా ఎంతో అవసరం. అందువల్ల ఎవరైనా సరే ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కోసారి డాక్టర్లు చెప్పేదాని కంటే ఎక్కువే తీసుకుంటారు కూడా. శరీర కండరాలను పటిష్టం చేయడంలో ప్రోటీన్ల పాత్ర అద్వితీయం. ప్రోటీన్లు తీసుకుంటూ సరైన వ్యాయామం చేస్తుంటే శరీరం దృడంగా ఉంటుంది. కొన్ని ప్రోటీన్ వనరులను ఆశ్రయించడం ద్వారా మనం అనుకున్న ఫలితాన్ని పొందవచ్చు. ప్రోటీన్లు సమృద్ధిగా దొరికే కొన్ని ఆహారపదార్థాలు ఏమిటో చూద్దాం.

 • గుడ్లు
 • బాదం
 • చికెన్ బ్రెస్ట్
 • ఓట్స్
 • చీజ్
 • కాటేజ్ చీజ్
 • పెరుగు
 • సోయాపాలు
 • చేపలు
 • పిస్తా పప్పు
 • వాల్ నట్స్
 • గుమ్మడికాయ విత్తనాలు

కానీ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నవారు అధికంగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోకుడదు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలన ఇంకా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిజానికి ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయట. ప్రొటీన్ మన శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. దానికి మించి తీసుకోకూడదు. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే సమస్యల్లో పడ్డట్టే.

జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువ ప్రొటీన్ తీసుకోకూడదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు.. జీర్ణ సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు.. ప్రొటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. దాని వల్ల.. ఆ సమస్యలు ఇంకాస్త ఎక్కువవుతాయి. వాళ్లకు కావాల్సినంత మోతాదు మేరకు మాత్రమే ప్రొటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అధికంగా ప్రొటీన్ తీసుకోవడం వల్ల.. కిడ్నీలకు ఇన్ఫెక్షన్ వస్తుంది.

సాధారణ స‌మ‌యాల్లోనే మన శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను వ‌డ‌బోసేందుకు కిడ్నీలు ఎక్కువ‌గా శ్ర‌మిస్తాయి. అదే ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం అయితే కిడ్నీల‌పై మ‌రింత భారం ప‌డుతుంది. దీంతో కిడ్నీల ప‌నితీరు కాల‌క్ర‌మేణా త‌గ్గుతుంది. అధికంగా ప్రొటీన్ శరీరంలో చేరడం వల్ల అమైనో ఆమ్లాల నుంచి విడుదలయ్యే నత్రజనిని నాశనం చేయడానికి కిడ్నీలు విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఫ‌లితంగా కిడ్నీ వ్యాధుల బారిన ప‌డ‌తారు.

అధికంగా ప్రొటీన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎక్కువగా నీళ్లను తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో కనీసం 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. దాని వల్ల.. అధిక ప్రొటీన్ తీసుకున్నా.. అది మూత్రపిండాల మీద బారం పడకుండా నీళ్లు ఆపగలుగుతాయి. ఇతర విష పదార్థాలను నాశనం చేయడాన్ని నీరు సులభతరం చేస్తుంది.

Exit mobile version