అరటి తొక్కలొ ఉన్న ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదు

కొంద‌రు రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకున్నా. ప‌ళ్లు మాత్రం తెల్ల‌గా ఉండ‌వు. దీంతో టూత్ పేస్ట్‌లు మారుస్తూనే ఉంటారు. అయితే అలాంటి వారు చింతించ‌కుండా ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు మీ ప‌ళ్ల‌ను తెల్ల‌గా మెరిపించ‌వ‌చ్చు. సాధారణంగా అందరికీ తెలిసిన పండు అరటి పండు. అరటి పండులో ఎన్ని పోషక విలువలు ఉన్నయో అరటి తొక్కలో కూడా అంతే పోషకాలు వున్నాయని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అరటిపండును మనం ఎంత ఇష్టంగా వెంటనే తింటామో , అరటి పండు తొక్కను కూడా అలానే వెంటనే పారేస్తాము. అయితే అరటి పండు మాత్రమే కాదు, అరటి పండు తొక్క కూడా మనకు మేలు చేస్తుంది.

తొక్కే కదా అని చులకన చేయకూడదు. సైంటిస్టులు చేసిన ప్రయోగాలు అరటి పండు తొక్క తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాయి. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరం అరటి పండు. అరటి పండుని ఎక్కువ మంది రెగ్యులర్ గా తీసుకుంటూనే వుంటారు. అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండులో విటమిన్లు B-6, B-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అలాంటి అరటి పండు ని తిని తొక్క పడేయకూడదు. అరటి తొక్కలొ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్య పోక తప్పదు.

4-Mana-Aarogyam-616అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉండడం వల్ల దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను తగ్గిస్తుంది. దోమకాటు వల్ల దురద మరియునొప్పి నుండి తక్షణం ఉపశమనం పొందాలంటే అరటి తొక్కతో ఆ ప్రాంతంలో మసాజ్ చేయాలి. షూస్, లెదర్, సిల్వర్ పాలిష్: ఏవైనా బూట్లు, తోలు, మరియు రజతం; వీటిని వెంటనే ప్రకాశింప చేయడానికి అరటితొక్కతో రుద్దండి. హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో అరటి తొక్క సహాయపడుతుంది.

2-Mana-Aarogyam-616అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది.ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధక బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు.దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు.

5-Mana-Aarogyam-616గారపట్టిన దాంతాలతో బాధపడే వారు అరటితొక్కతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటం వలన దంతాలు తెల్లగా మెరుస్తాయి. అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా,తెల్లగా మారుతాయి.చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. కాలుష్యం, సూర్యకాంతి, దుమ్ము ధూళి, తీసుకునే ఆహారం.. ఇవన్నీ మన చర్మంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దాంతో చర్మం నల్లగా మారుతుంది. అయితే మనం వృధాగా పడేసే అరటి పండు తొక్క ఈ సమస్యలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. జిడ్డు చర్మం వున్న వారు చెంచా తేనె, నిమ్మరసం, ఒక అరటి తొక్కను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపాగి గోరువెచ్చనితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంలో అధిక జిడ్డు వదులుతుంది.

6-Mana-Aarogyam-616చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం. మొటిమలతో బాధపడేవారు అరటి పండు తొక్కతో ముఖాన్ని ఐదు నిమిషాల పాటు మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల వారం రోజులు మంచి ఫలితం ఉంటుంది.అరటితొక్క మొత్తగా చేసి దానికి గ్రుడ్డు సొనను కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద రాసి, ఐదు నిముషాలు రువాత కడగండి. స్కిన్ ప్లోడింగ్స్ నుండి ఉపసమనం కలుగుతుంది. అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను వుంచడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

1-Mana-Aarogyam-616సోరియాసిస్ తో బాధపడుతున్న వారు అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు. దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.

8-Mana-Aarogyam-616అరటి పండులోని తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి .. దీనిని తినడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతంది. ఒకవేళ తొక్కని పూర్తిగా తినకపోయినా.. అందులోని తెల్లని పదార్థాన్ని స్పూన్‌తో తీసుకోవచ్చు. అరటి పండు తొక్కలోట్రిప్టోఫాన్ అనే రసాయనం నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.

9-Mana-Aarogyam-616అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది.ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది. అరటి తొక్క హానికరమైన యూవీ కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది. రేచీకటి, శుక్లాలు రావు. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు.లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు.దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR