ఉల్లిపాయ టీ త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

“ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు” దాదాపుగా ఈ సామెత అందరికి తెలుసు. మరి ఉల్లపాయలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టే పురాతన కాలం నుండి ఉల్లి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడు ఉల్లిపాయలను రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తాము కాని ప్రాచీన కాలంలో ఉల్లిపాయ పాలను ఔషధంగా వివిధ మార్గాల్లో ఉపయోగించేవారు. అందుకే ఈ రోజు ఆయుర్వేద వైద్యంలో ఉల్లిపాయలకు చోటు దక్కింది. మనం ఉల్లిపాయలను ఆహారంలో వేయించడంతో పాటు అనేక రకాలుగా ఉపయోగించవచ్చు, అందులో ముఖ్యమైనది ఉల్లిపాయ టీ. ఉల్లిపాయ టీతో లభించే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

ఉల్లిపాయ టీఉల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లిపాయలను తీసుకోవడం కాన్సర్ వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే రోజుకి ఉల్లిపాయలను ఏదో ఓ రూపంలో తీసుకోవాలని చెబుతున్నారు.

ఉల్లిపాయ టీప్రజెంట్ వర్షాల సీజన్ ప్రారంభమైంది. ఈ టైమ్‌లో జలుబు, జ్వరాలతో ప్రజలు అల్లాడుతుంటారు. ఈ టైమ్‌లోనూ ఉల్లిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక కరోనా వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వంటింట్లో దొరికే అనేక మసాల పదార్థాలతో పాటు.. ఉల్లిపాయలు కూడా ఉపయోగపడుతాయని చెబుతున్నారు. అందుకోసం ఉల్లిపాయలతో టీ చేసుకుని తాగొచ్చని చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు.

ఉల్లిపాయ టీసీసన్ తో సంబంధం లేకుండా వచ్చే దగ్గు, జలుబు ఉన్నవారు ఆనియన్ టీని తాగడం వల్ల ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. శ్వాస కోశ సమస్యలకు ఈ టీ అద్భుతంగా పని చేస్తుంది. హైబీపీ ఉన్నవారు ఉల్లిపాయల టీని తాగితే బీపీ సమస్య తగ్గుతుంది..

ఉల్లిపాయ టీఉల్లిపాయల టీ తాగడం వల్ల అనేక సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రక్తసరఫరా సజావుగా సాగుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఈ కారణంగా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. గుండె సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ. ఇన్ని లాభాలు ఉన్న ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు – ఒక కప్పు
వెల్లుల్లి – 4
బిర్యానీ ఆకు -2
తేనె – 4 స్పూన్లు
నీళ్లు – ౩ కప్పులు

ఉల్లిపాయ టీతయారీ విధానం :

ముందుగా ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగాక అందులో ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లి, బిర్యానీ ఆకులను వేసి ఆకులను మరిగించాలి. ఇలా మరిగి నీరు రంగు మారాక స్టౌవ్ ఆఫ్ చేయండి. ఇలా తయారైన టీ కాస్తా గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలపాలి. ఇలా గోరువెచ్చని టీని ఉదయాన్నే తీసుకోండి. ఇలా తాగుతుంటే షుగర్ కంట్రోల్‌లో ఉండడంతో పాటు అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. కరోనా వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR