జింక్ ఎక్కువుగా ఉండే ఆహారం తినడం వల్ల కలిగే లాభాలు

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంన్నారు. మందులతో పనిలేకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. తద్వారా కరోనా సహా వెయ్యికి పైగా రకాల వైరస్‌లను ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇండియాలో ఆల్రెడీ సెకండ్ వేవ్ ఉంది. నవంబర్‌లో థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. అందువల్ల మనం సరైన ఆహారం తినాలి. మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకుంటే… ఇక మందులతో పని ఉండదు…

2-Mana-Aarogyam-615మన శరీరానికి విటమిన్ సీ బాగా అందితే… అది కణాలకు బలం ఇస్తుంది. అప్పుడు వైరస్‌ కణం దగ్గరకు వచ్చినప్పుడు కణం దానికి లొంగదు. కణం లొంగకపోతే… వైరస్ ఓడిపోతుంది.విటమిన్ సీ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలోని కణాజాలకు మరింత శక్తి చేకూరుతుంది. అందువల్ల ఎలాంటి వైరస్ తో నైనా పోరాడే శక్తిని కణాలు పొందుతాయి. కరోనా వైరస్ లాంటి క్లిష్టమైన వైరస్ ను కూడా ఎదుర్కోవడంలో విటమిన్ సీ దోహదపడుతుంది. చనిపోతుంది. కాబట్టే మనం సీ విటమిన్ ఉండే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం.

3-Mana-Aarogyam-615ఇదే పనిని జింక్ కూడా చేస్తుంది. ఇదే స్ధాయిలో ఎలాంటి వైరస్ నైనా చంపడంలో కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు సి విటమిన్ కలిగిన పదార్దాలతో పాటు జింక్ సరిపడా లభించే పదార్దాలను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. చాలా మంది విటమిన్ సి కోసం, జింక్ లోప సమస్యను అధిగమించేందుకు టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటారు. కానీ అది సహజంగా లభించిందానికి, ఇలా టాబ్లెట్స్ రూపంలో తీసుకున్న దానికి చాల తేడా ఉంటుంది. ఇలా టాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య వస్తాయని నిపుణులు చెపుతున్నారు. వాటి బదులు జింక్ ఉండే ఆహారం తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. జిక్… మన చర్మం, పాంక్రియాస్, లివర్, కిడ్నీలకు మేలు చేస్తుంది.

జింక్ ఉన్న పదార్థాలు లభించే ఆహార పదార్దాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డి విటమిన్ లాగా జింక్ అనేది ఎండలో లభించదు. అందుకే చాలా మందికి జింక్ లోపం ఉంటుంది. జింక్ కావాలంటే మనం ఆహారం తినాల్సిందే. జింక్ సరిపడా లేకపోతే డయేరియా (అతి మూత్రం) సమస్య వస్తుంది. మనిషి ఎదుగుదల ఆగిపోతుంది, జుట్టు రాలుతుంది, కళ్లు, చర్మం దెబ్బతింటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోజూ మగవాళ్లకు 11 మిల్లీగ్రాములు, ఆడవారికి 8 మిల్లీగ్రాముల జింక్ అవసరం. మాంసాల్లో జింక్ ఉంటుంది. కానీ శాఖాహారులు జింక్ కోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు.

రోజు ఆహారంలో శనగలు తీసుకోవడం వల్ల జింక్‌తో పాటూ, ఐరన్, సోడియం, సెలెనియం, మాంగనీస్, రాగి లభిస్తాయి. పల్లీలను ప్రతిరోజూ డైట్ లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ మాత్రమే కాదు.. దీనిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది.

6-Mana-Aarogyam-615గుమ్మడికాయ గింజల్లో కూడా జింక్ ఉంది. 28 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 2.2 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ 8.5 మిల్లీగ్రాములు ఉంటాయి. గుమ్మడికాయ గింజల్ని తరచూ తింటూ ఉంటే… కేన్సర్ తగ్గే అవకాశాలు ఉంటాయని పరిశోధన తెలిపింది. జింక్ లోపం ఉన్నవారు… రోజూ గుప్పెడు గుమ్మడికాయ గింజలు తినాలి.

7-Mana-Aarogyam-615చిక్కుడు, పప్పు ధాన్యాలు.. పప్పు ధాన్యాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ప్రోటీన్స్, ఫైబర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

4-Mana-Aarogyam-615పుచ్చకాయ గింజల్లో పోషకాలు, జింక్, మాక్రోన్యూట్రియంట్స్ ఎక్కువ. కొన్ని గింజలు తిన్నా చాలు 4 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. మీరు వాటిని ఎండబెట్టి… రోజూ స్నాక్స్‌లా తినవచ్చు. గుమ్మడికాయ గింజలు వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయి. గుండెను కాపాడతాయి.

8-Mana-Aarogyam-615నట్స్.. జీడిపప్పు, బాదం పప్పు లాంటి నట్స్ కూడా రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరంలోని చెడు కొలిస్ట్రాల్ ని బయటకు వెళ్లగొట్టేందుకు సహాయం చేస్తుంది.

10-Mana-Aarogyam-615జనపనార విత్తనాల్లో కూడా పోషకాలు ఎక్కువే. ఇందులో కరిగిపోని కొవ్వు, జింక్ ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ జనపనార గింజల్లో 1 మిల్లీ గ్రామ్ జింక్ ఉంటుంది. ఈ గింజల్లో శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు కూడా లభిస్తాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పెరుగు, సలాడ్లలో ఈ గింజలు చల్లుకొని తినవచ్చు.

9-Mana-Aarogyam-615పెరుగు.. మీ ఆహారంలో పెరుగుకి కూడా చోటు కల్పించాలి. మధ్యాహ్నం సమయంలో మీ భోజనం తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు తినడం మంచిది. ఫ్యాట్ ఎక్కువగా లేని పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన పొట్టలో చేరి… కావాల్సినంత జింక్ అందిస్తుంది. ఓ కప్పు పెరుగులో 1.5 మిల్లీ గ్రాముల జింక్ ఉంటుంది.

1-Mana-Aarogyam-615కిడ్నీ ఆకారంలో ఉండే బీన్స్, బ్లాక్ బీన్స్‌లో జింక్ ఎక్కువే. ఇవి కరిగిపోయే, కరగని ఫైబర్, ప్రోటీన్స్, ఐరన్, పాస్పరస్, కాల్షియం వంటివి ఇందులో ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఓ కప్పు వండిన బీన్స్‌లో 0.9 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR