ఉడకపెట్టుకొని తినే స్వీట్‌ కార్న్‌ వల్ల ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

కరోనా వచ్చాక అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహరం ఏంటా అని ఇంటర్నెట్ లో వెతికి మరీ తెలుసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మనకు మొక్కజొన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా సూపర్‌ మార్కెట్‌ కల్చర్‌ వచ్చాక కాలంతో సంబంధం లేకుండా ఇవి లభిస్తున్నాయి. మొక్క జొన్నతో తయారయ్యే అన్నీ పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో స్వీట్‌ కార్న్‌ మొదటి వరుసలో ఉంటుంది. అప్పటికప్పుడు సింపుల్‌గా ఉడకపెట్టుకొని తినే స్వీట్‌ కార్న్‌ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

స్వీట్‌ కార్న్‌చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో మొక్కజొన్న కెర్నల్స్ చేర్చవచ్చు. మొక్కజొన్న కెర్నల్స్‌లో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, బి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న కెర్నల్స్‌లో స్టార్చ్, ఫైబర్ ఉంటాయి. మొక్కజొన్నలో జింక్, భాస్వరం కూడా ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున చాలా మంది ప్రజలు అన్ని సమయాలలో అనారోగ్యానికి గురవుతారు. వారికి మొక్కజొన్న బాగా పనిచేస్తుంది. మారుతోన్న జీవన విధానం, ఆహార పదార్థాలతో దెబ్బ తింటోన్న ఆరోగ్యాన్ని స్వీట్‌ కార్న్‌తో చక్కదిద్దుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్‌ కార్న్‌మొక్కజొన్న కెర్నలు ఫైబర్ కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం సమస్యను అధిగమించగలదు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్వీట్‌ కార్న్‌ చాలా త్వరగా జీర్ణం కావడంతో ఉన్నపలంగా శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. పైల్స్‌తో బాధపడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి వారికి ఈ స్వీట్‌ కార్న్‌ దివ్యవౌషధమని చెప్పాలి. ఇలా ఎన్నో మంచి గుణాలున్న స్వీట్‌ కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో ఓ భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

స్వీట్‌ కార్న్‌స్వీట్‌ కార్న్‌లో యాంటీఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్ లను నిరోధిస్థాయి. ఇది కోలన్ క్యానర్(పెద్ద ప్రేగు క్యాన్సర్ ను)ప్రమాదాన్ని తగ్గింస్తుంది. ఇవి క్యాన్సర్‌కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్‌ను నివారిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో వీటి పాత్ర క్రీయాశీలకంగా ఉంటుంది.

స్వీట్‌ కార్న్‌నిత్యం ఒత్తిళ్ల పొత్తిళ్లలో నలిగిపోయే వారికి స్వీట్‌ కార్న్‌ మంచి మందులా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్‌ ఫైటోకెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ తగ్గిండచంలో బాగా పనిచేస్తుంది. మొక్కజొన్నలో మెగ్నీషియం, ఆర్సెనిక్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలో జింక్, భాస్వరం కూడా ఉన్నాయి. ఇది ఎముక సంబంధిత వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. ఐరన్, విటమిన్ ఎ, థియామిన్, విటమిన్ బి 6, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు అందిస్తుంది.

స్వీట్‌ కార్న్‌మొక్కజొన్న కెర్నల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. అవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. మొక్కజొన్న కెర్నల్స్ ను ఆహారంలో చేర్చుకుంటే దృష్టి మెరుగుపడుతుంది.

స్వీట్‌ కార్న్‌స్వీట్ కార్న్ తగినంత పరిమాణంలో వినియోగించుకుంటే, మధుమేహంతో బాధపడే వారికి చాలా మంచిది. స్వీట్ కార్న్ లో ఉండే ఫైటోకెమికల్స్ మధుమేహవ్యాధిని రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది.

స్వీట్‌ కార్న్‌ఇక స్వీట్ కార్న్‌లో ఉండే విటమిన్‌ సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

స్వీట్‌ కార్న్‌స్వీట్ కార్న్ లో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ బి మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది.మన శరీరంలో టిష్యులను బలోపేతం చేస్తుంది. వయస్సునవారిలోజాయింట్ పెయిన్స్ ను నివారించడానికి ఉడికించిన స్వీట్ కార్న్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

స్వీట్‌ కార్న్‌గర్భవతి మహిళలు తమ ఆహారంలో స్వీట్ కార్న్ తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR