Home Health మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందన్న విషయం మీకు తెలుసా?

మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయ తింటే షుగర్ కంట్రోల్ అవుతుందన్న విషయం మీకు తెలుసా?

0

ఒకప్పుడు వయస్సు మీద పడినప్పుడు మాత్రమే డయాబెటిస్ దాడి చేసేది. కాలంతోపాటు.. జీవనశైలి కూడా మారడంతో ఇప్పుడు చిన్న వయస్సులోనే ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇందుకు మరెన్నో కారణాలు ఉన్నాయి. ఒకేచోట కూర్చుని ఉద్యోగం చేయడం, శరీరానికి తగిన వ్యాయమం లేకపోవడం, స్థూలకాయం, పని ఒత్తిడి, కొవ్వు పదార్థాలు అతిగా ఆరగించడం వంటివి కూడా ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో సంభవిస్తున్న మరణాల్లో డయాబెటీస్ వలన 2 శాతం వరకు మరణాలు సంభవిస్తున్నాయి. అంటే దేశంలో ఈ వ్యాధి ఎంత గణనీయంగా పెరుగుతుందో అర్థమవుతుంది. ఈ వ్యాధికి ఇప్పటివరకు శాశ్వతమైన చికిత్స లేదు. కేవలం నియంత్రణ మాత్రమే ఉంది. ఇక డయాబెటిస్ ఒక్కసారి ఎటాక్ అయింది అంటే ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

Can people with sugar eat crocusమరీ వీరు బెండకాయ తినోచ్చా ? తింటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయలు అన్నిరకాల పోషకాలతో దొరికే అద్భుతమైన సూపర్ ఫుడ్ గా మనకు అందుబాటులోనే ఉండే కాయగూరలు. పైగా ధర కూడా తక్కువే. సాంబారు, పచ్చడి, ఫ్రై, మసాలా కూరలు, ఇలా పలురకాల వంటకాలలో ఈ బెండకాయలను విరివిగా ఉపయోగించడం జరుగుతుంటుంది. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని మన పెద్దలు తరచుగా అనడం మనం వినే ఉంటాము. అందులోని పోషక ప్రయోజనాల దృష్ట్యా, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆ మాట వెనక ఉన్న అర్ధం. అందుచేత, వీలైనంత ఎక్కువగా బెండకాయలను మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం ద్వారా, అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టగలరని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. మరి షుగర్ ఉన్నవాళ్లకు బెండకాయ చేసే మేలెంతో తెలుసుకుందామా.

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారుచెబుతున్నారు. డయాబెటిస్‌తో పోరాడటానికి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు సహజంగానే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి దోహదం చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, రక్తంలోని చక్కెరలను ప్రతికూలంగా ప్రభావితం చేయని బెండకాయలు కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ బెండ కాయలు ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలంగా చెప్పబడుతున్నాయి.

ఇందులో ప్రధానంగా ఎ, బి1 (థయామిన్), బి2 (రిబోఫ్లోవిన్) , బి3 (నియాసిన్), బి9 (ఫోలైట్), సి, ఈ, కె విటమిన్లు ఉండగా, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ తోపాటు డైటరీ ఫైబర్ కూడా అదనంగా ఉంటుంది. ఒక సాధారణ బెండకాయ 90 శాతం నీటితో, 7 శాతం కార్బోహైడ్రేట్లతో, 2 శాతం ప్రోటీన్లతో కూడుకుని ఉంటుంది. అంటే డయాబెటిస్ ఉన్నవారు దీనిని రోజూవారీ ఆహారంలో తీసుకున్నా ఎటువంటి ఆందోళనా ఉండదు.

బెండకాయలో కరగని డైటరీ ఫైబర్, నెమ్మదిగా గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు జీర్ణ క్రియలకు సహాయపడేలా ప్రేగు మార్గాన్ని సులభతరం చేయడంలో కూడా బెండకాయలు సహాయం చేస్తాయి. క్రమంగా మలబద్దకం వంటి సమస్యలతో పోరాడడంలోనే కాకుండా, అజీర్ణం వంటి కడుపు సంబంధ సమస్యలు ఏర్పడకుండా చూస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయి. క్రమంగా గర్భస్థ మధుమేహం కలుగకుండా సహాయపడుతుంది.

యాంటీ డయాబెటిక్, హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని బెండకాయ ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో కొలెస్ట్రాల్ నియంత్రించడమే కాకుండా.. యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందువల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బెండకాయ శరీరంలో లిపిడ్ స్థాయిలను తగ్గించడమే కాకుండా ప్యాంక్రియాటిక్ కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే జన్యుపరమైన కారకాల వలన బీటా సెల్ పనిచేయకపోవడం వంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి హెవీ షుగర్ లెవల్స్ మూత్రపిండాల నరాలను దెబ్బతీస్తుంది. బెండకాయ గ్లోకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే మూత్రపిండాలను కాపాడుతుంది. డయాబెటిస్ నియంత్రణ కోసం బెండకాయను ఎలా ఉపయోగించాలి. రాత్రి పడుకునే ముందు రెండు బెండకాయలను కాడలు కట్ చేసి ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత మరునాడు ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. బెండకాయలలో ఉండే విటమిన్ కె, ఎముకలు ఏర్పడటానికి మరియు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.

 

Exit mobile version