గుడికి వెళ్లడం వలన మనసు ఎందుకు ప్రశాంతంగా మారుతుంది ?

పుట్టినరోజు పూట మనం ముందుగా చేసే పని ఏంటి? తలారా స్నానం చేసి గుడికెళ్ళి దేవుడి ఆశీర్వాదాలు తీసుకుంటాం. ఇక ఏదైనా పండగ వచ్చిందంటే ఉదయాన్నే వెళ్లి భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకోమని చెబుతారు. తరుచూ గుడికి వెళ్లడం అనేది చాలా మందికి అలవాటుగా ఉంటుంది. గుడికి వెళ్లడం అనేది పెద్దలు ఎంతో అనుభవంతో మనకు నేర్పిన సలక్షణం.

Templeఅయితే గుడికి వెళ్ళడం వెనుక మర్మమేమిటో తెలియకుండా మనం పెద్దలు చెప్పిన ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటాం. మరి నిజంగా గుడికి వెళితే మనకు అంతటి ప్రేరణ, ప్రశాంతత వస్తుందా? గుడిని దర్శించుకోవడం వెనుక ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Templeఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలాగే భూమిలో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తూ ఉంటుంది. అది భూమి స్వభావం. ఆ ప్రాంతంలో ఉండే ఖనిజాలు, లోహాలను అనుసరించి ఉంటుంది. అందుకే ఆలయం నిర్మించడానికి అప్పట్లో కొన్ని ప్రత్యేక ప్రదేశాలను మాత్రమే ఎన్నుకునేవారు. ఆ గుళ్లలోకి వెళ్లగానే శరీరం ఒక్కసారిగా చల్లబడుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఇది కావాలంటే పరిశీలించి చూడడండి.

Templeఎంపికైన ప్రదేశంలో దేవాలయం, ఆకర్షణ శక్తి అధికంగా ఉన్న కేంద్రంలో మూలవిరాట్టును ప్రతిష్టింప చేస్తారు. వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు)ను విగ్రహం కింద నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.

Templeఅందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ప్రతి రోజు గుడికి వెళ్ళేవారిలో దివ్యశక్తి చేరడాన్ని మనం గమనించవచ్చు. గుడి వెళ్ళి వచ్చేవారు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది.

Templeఅందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు మరింత శక్తిని సమకూరుస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR