వేడి నీరు, నిమ్మరసంతో కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

సాధారణంగా మనమంతా నిమ్మరసంలో చక్కెర లేదా ఉప్పు వేసుకొని తాగుతాం. లేదంటే లెమన్ టీ తీసుకుంటాం. అందువల్ల చాలా ప్రయోజనాలుంటాయి. ఐతే, అదే నిమ్మరసాన్ని రోజూ గ్లాస్ వేడి నీటిలో కలుపుకుని తాగితే సహజసిద్ధమైన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో తెలుసుకుందాం.

Benfits Of Lemon and Hot waterనిమ్మకాయ ఓ అద్భుత ఫలం అనే చెప్పాలి.. వీటిని వంటల్లో ఉపయోగిస్తాం. అలాగే సౌందర్యాన్ని పెంపొందించేందుకు వాడుతుంటాం.. జుట్టు లో చుండ్రు పోగొట్టి కేస సంరక్షణలోనూ ఉపయోగపడ్తుంది.. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. అయితే వీటికి మించిన ప్రయోజనాలు నిమ్మరసంతో కలుగుతాయంటే నమ్మాల్సిందే. రోజూ ఉదయాన్నే ఓ గ్లాస్ వేడి నీళ్లు తీసుకుని, ఓ నిమ్మకాయను అందులో పూర్తిగా పిండి, ఆ నీటిని తాగాలి. ఇలా చేయటం వలన ఎన్నో ప్రయోజనాలు. అంతేకాదు చాలా రోగాలు కూడా మాయమవుతాయి. బాడీకి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అంతెందుకు రోజూ నిమ్మరసం తాగుతూ ఉంటే, ఇక తమ దగ్గరకు రావాల్సిన పని ఉండదని డాక్టర్లే చెబుతున్నారు. వేడి నీటితో నిమ్మరసాన్ని తాగితే మన కొవ్వును కరిగించేస్తుంది.

Benfits Of Lemon and Hot waterశ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉన్నాయి. దీంతో అధిక బ‌రువు ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది. గుండె సంబంధ స‌మ‌స్య‌లు కూడా దాదాపు రావు. అలాగే డయాబెటిస్ ఉన్న‌వాళ్లు నిమ్మ‌ర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. తద్వారా మ‌ధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.

Benfits Of Lemon and Hot waterమనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం, తాగే నీళ్ల వల్ల చాలా మలినాలు మన బాడీలోకి వెళ్తుంటాయి. ఒక్కోసారి విష పదార్థాలు కూడా లోపలికి వెళ్లి తిష్టవేస్తాయి. వాటికి వేడి నీళ్లు నిమ్మరసం సరైన పరిష్కారం. ఈ రసం తీసుకుంటే, మన శరీరంలోని మలిన పదార్ధాలు బయటకు వెళ్లేందుకు క్యూ కడతాయి. అంతేకాదు మరిన్ని రోగాలు రావని పరిశోధనల్లో తేలింది.

Benfits Of Lemon and Hot waterనిమ్మ‌ర‌సంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విట‌మిన్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఫంగ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు ఉండడం వ‌ల్ల చాలా ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు తేలిగ్గా తగ్గిపోతాయి. వేడి నీటితో నిమ్మరసం తీసుకుంటే, బాడీలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. సిట్రేట్ లెవెల్స్ కూడా మెరుగవుతాయి. ఫలితంగా కిడ్నీలో రాళ్లు నెమ్మదిగా కరిగిపోతాయి. కిడ్నీలోనే కాదు గాల్ బ్లాడర్‌లో రాళ్లను కూడా తరిమికొడుతుంది నిమ్మరసం. ఫలితంగా కడుపునొప్పి సమస్య తీరుతుంది. ఇలాంటి సమస్యలతో ఉన్నవాళ్లు రోజూ వేడి నీటి నిమ్మరసం తాగాల్సిందే.

Benfits Of Lemon and Hot waterరోజూ ఇలా తాగితే జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు రావు. ప్ర‌ధానంగా గ్యాస్‌, ఏసీడీటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటివి మనకు తెలియకుండానే తగ్గిపోతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల నిమ్మ‌ర‌సం మ‌న చ‌ర్మానికి మేలు చేస్తుంది. స్కిన్ మెరుస్తుంది. మృదువుగా, కోమలంగా త‌యార‌వుతుంది. ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోతాయి. నొప్పులు, వాపులు ఉన్న‌వారు నిమ్మ‌ర‌సం తాగితే ఫ‌లితం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది బాగా ఉప‌క‌రిస్తుంది. ఫ్లూ జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌లకు చక్కటి పరిష్కారం వేడి నీటి నిమ్మరసం.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, రోజూ ఉదయాన్నే గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి, తాగమంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR