స్కిన్ గ్లో అవడానికి మన డైట్‌ను ఎలా మార్చుకోవాలో తెలుసా ?

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహార శైలి వల్ల వచ్చే కాంతి వారి ముఖం పై ప్రతిబింభిస్తుంది. లోపలి అందం ఒకరి ముఖం మీద, చర్మంపై కూడా పడుతుంది. మెరుస్తున్న, ప్రకాశవంతమైన చర్మం యొక్క అందానికి ప్రపంచంలో ఏ అలంకరణ సాటిరాదు. అయితే, వీటి కోసం చర్మాన్ని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

స్కిన్ గ్లోచర్మ సంరక్షణ గురించి మనం మాట్లాడినప్పుడు.. మొదటిగా గుర్తొచ్చేది స్కిన్ ప్రొడక్ట్స్. సహజమైనవి, బ్యూటీ షాపుల నుండి మనం కొనేవి. చర్మాన్ని ఆరోగ్యాంగా మరియు కాంతివంతంగా ఉంచటానికి రెగ్యులర్‌గా బ్యూటీ పార్లర్స్‌కి వెళ్తారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యమని మర్చిపోతాం. ఆరోగ్యకరమైన ఆహారం చర్మం వృద్ధాప్యాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెపుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల మొటిమలు, చర్మ సమస్యలు తలెత్తుతాయని హెల్త్ అండ్ బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కాబట్టి, ఆరోగ్యంగా, మెరుస్తున్న చర్మం పొందడానికి మన డైట్‌ను ఎలా మార్చుకోవాలో చూద్దాం.

క్యారెట్ జ్యూస్:

స్కిన్ గ్లోగ్లోయింగ్ స్కిన్ కు ఒక ఉత్తమ వెజిటేబుల్ జ్యూస్ క్యారెట్ జ్యూస్. ఎందుకంటే ఈ క్యారెట్ జ్యూస్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉండి బౌల్ మూమెంట్ ను మెరుగుపరిచి, పొట్టను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుంది. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది, వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు. ఇది మిమ్మల్ని యంగ్ గా మరియు రేడియంట్ గా మార్చేస్తుంది.

ఆకు కూరల రసం:

స్కిన్ గ్లోఆకుకూరలతో సూప్స్ తయారుచేయడం ఒక ఉపాయం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రసాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉండే బోన్ హెల్త్ కు సహాయపడుతుంది. మరో మూలకం ఐరన్ కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది చర్మసౌందర్యం పెంపొందించడంలో ఒక ఐడియల్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు . ఎందుకంటే ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. విటమిన్ సి మరియు ఇ మరియు మినిరల్స్ మరియు మెగ్నీసియం గొప్ప యాంటీఆక్సిడెంట్స్ గా పనిచేసి శరీరంలో ఫ్రీరాడిక్ల్స్ నుండి దూరంగా ఉంచుతుంది. ఈ ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం దెబ్బతింటుంది మరియు డల్ గా మారుతుంది.

టమోటోజ్యూస్ :

స్కిన్ గ్లోసహజంగా ప్రతి ఇంట్లో తయారుచేసుకొనే జ్యూస్ లలో కామన్ జ్యూస్ ఇది. టమోటోను ఫ్రూట్స్ గాను మరియు వెజిటేబుల్ గాను భావిస్తుంటారు. వీటిని వివిధ రకాల వంటలో ఉపయోగిస్తుంటారు. టమోటో జ్యూస్ మన శరీరానికి చాలా మంచిది అని చెప్పవచ్చు ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ ను వేరు చేసే మూలకం పొటాషియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు లైకోపిన్ అనే లక్షణాలు కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీక్యాన్సేరియస్ లక్షణాలను నివారిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మానికి చాలా మంచిది.

కాలీఫ్లవర్ :

స్కిన్ గ్లోకాలీఫ్లవర్ బాగా పాపులర్ వెజిటేబుల్ , ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ద ఉన్నవారు దీన్ని ఎక్కువ గా తీసుకుంటారు. అన్ని రకాల వెజిటేబుల్స్ కంటే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎక్కువ పోషకాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇదిహెల్తీ స్కిన్ కోసం చాలా అవసరమైనటువంటిది. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ మరియు న్యూట్రీషియన్స్ ఎక్కువ కాబట్టి, చర్మానికి మరియు శరీరానికి చాలా ఉపయోగకరమైనది.

కీరదోసకాయ జ్యూస్ :

స్కిన్ గ్లోకీరదోసకాయ జ్యూస్ చర్మానికి ఒక బెస్ట్ జ్యూస్. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు బీటాకెరోటిన్ మిమ్మల్ని మరింత యవ్వనంగా ఉంచుతుంది.

బొప్పాయి:

స్కిన్ గ్లోచూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. రోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జు తో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు, యాపిల్ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం తీసుకొని అందులో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

జామకాయతో :

స్కిన్ గ్లోజామకాయలో విటమిన్‌ ‘ఏ’ మరియు విటమిన్‌ ‘సి’ నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ ‘సి’ నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR