కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు ఈ పదార్ధాలు అసలు తీసుకోకండి

ఈ కాలంలో చాలామంది ఇబ్బంది పడే ఆరోగ్య సమస్యల్లో కిడ్నీ స్టోన్స్ కూడా ఒకటి. ఈ సమస్యకు మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి ప్రధాన కారణాలు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. ఇవి యూరిన్ లో ఉండే యూరిక్ ఆసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, ఆక్సాలిక్ ఆసిడ్స్ నుండి తయారవుతాయి.

beware of these food you have kidny stonesఅయితే ఈ రాళ్లు ఐదు మిల్లీ మీటర్ల కంటే తక్కువున్నట్లయితే యూరిన్ లో నుంచి బయటకు వెళ్ళిపోతాయి. కానీ పెద్ద స్టోన్స్ మాత్రం యూరిన్ నుండి బయటకు వెళ్లవు. బాధని కలుగ చేస్తాయి. ఇవి యూరిన్ యొక్క ఫ్లో ని అడ్డుకుంటాయి. అలాగే, యూరిన్ లో బ్లడ్ వంటి లక్షణాలను కలుగ చేస్తాయి.

beware of these food you have kidny stonesకిడ్నీ సమస్యలను తగ్గించుకోవడానికి, తగ్గినవి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారం లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

కోడి, చేప, గుడ్లు:

beware of these food you have kidny stonesరెడ్ మీట్, పాలు, పాల ఉత్పత్తులు , చేపలు , గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. అందుకని వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. కనుక కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వారు ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. అయితే శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది కనుక టోఫు, క్వినోవా, కూరగాయల విత్తనాలు మరియు గ్రీకు పెరుగు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఆహారంగా తినాలి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు లభిస్తాయి.

బచ్చలికూర :

beware of these food you have kidny stonesదీనిలో ఐరెన్, విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు బచ్చలికూర తినడం మానేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ఆక్సలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది. అందుకని మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయలేవు . ఇది శరీరం నుండి మూత్రం ద్వారా బయటకు వెళ్ళదు, దీనివల్ల మూత్రపిండాలలో నిల్వ ఉండి చక్కటి రాళ్ళు ఏర్పడతాయి.

ఆక్సలేట్ ఫుడ్ :

beware of these food you have kidny stonesబచ్చలికూరతో పాటు, బీట్‌రూట్, ఓక్రా, బెర్రీస్, కంద దుంప, టీ, చాక్లెట్ వంటి వాటిల్లో అధిక ఆక్సలేట్ కంటెంట్ ఉంటుంది. రోగికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే.. తప్పని సరిగా డాక్టర్ వారికి ఆక్సలేట్ ఉన్న ఆహారం తినవద్దని.. లేదా తక్కువుగా తినమని సలహా ఇస్తాడు.

శీతల పానీయాలు :

beware of these food you have kidny stonesకోలాలో ఫాస్ఫేట్ అనే రసాయనం ఉంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. అందువల్ల, నిల్వ చేసిన ఆహారాలు మరియు పానీయాలను అధికంగా తాగవద్దు. ఉప్పు మాత్రమే కాకుండా అధిక చక్కెర, సుక్రోజ్ మరియు ఫ్రక్టోజ్ లు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారకాలు మారే ప్రమాదం ఉంది.

సోడియంను తక్కువుగా ఉపయోగించాలి:

beware of these food you have kidny stonesఉప్పులో సోడియం ఉంటుంది. ఇక సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం ఏర్పడుతుంది. కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు కలపడం మానుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉండే ఆహారం ఉప్పు ఉన్న చిప్స్ ను తినడం తగ్గించాలి.

కిడ్నీలో రాళ్ళు సాధారణంగా కాల్షియం ఆక్సలేట్‌తో తయారవుతాయి. ఈ రాళ్ళు చిన్నవిగా ఉన్నందున, గుర్తించడానికి అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో, అవి శరీరాన్ని విడిచి మూత్రం ద్వారా విడుదల అవుతున్నప్పుడు, విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR