భిమానది ఒడ్డున రుక్మిణి సమేత వెలసిన పాండురంగడి ఆలయం గురించి తెలుసా ?

మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పండరీపురములో ఈ ఆలయం ఉంది. భిమానది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఈయనను శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటకకు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో ధ్యానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాం, పురంధర దాసు, విజయ్ దాస్, గోపాల్ దాస్, జగన్నాథ్ దాస్, పాండురంగ‌ణ్ని కొలిచి ముక్తిపొందారు.

Bheema nadhiఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి. మహారాస్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడా పిలుచుకుంటారు. కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్షలో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగె, వేంకటేస్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆయా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ. ఆషాఢ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో పండ‌రీపురం చేరుకుని స్వామిని సేవిస్తారు. భీమానదీ ప్రాంతమంతా జన సంద్రంలాగా కోలాహలంగా వుంటుంది. పాద యాత్రికులు ఆ రోజుకు అక్కడికి చేరుకునే టట్లు తమ ప్రయాణాన్ని నిర్ణ యించుకుంటారు.

Bheema nadhiపండ‌రీపురం విఠ‌లుని కన్నులార చూద్దామ‌నే త‌ప‌న హిందువుల‌లో ఎక్కువగా క‌నిపిస్తుంది. అందుకు కార‌ణం ఏదేవదేవునికి లేనంత భక్తులు వారి ముక్తి పొందే తీరులు భ‌క్తులు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటారు. మ‌హాభ‌క్త‌విజ‌యం వంటి సుప్ర‌సిద్ద గ్రంథం అన్ని భాష‌ల‌లో భ‌క్తులు అత్యంత శ్ర‌ద్ధాభ‌క్తుల‌తో ప‌ఠిస్తారు. ఆపైన ద‌ర్శించాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతారు.

Bheema nadhi

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR