భీష్ముడు స్త్రీల కోసం చెప్పిన అతిముఖ్యమైన విషయాలు

0
687

మహాభారతంలో బీష్ముడు అంటే తెలియని వారు ఉండరు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకంలో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు ప్రకృతి తత్వానికి ప్రతీకలు. అయితే భారతంలో శక్తి వంతమైన పాత్ర ఈయనది.

Bhishmaఎక్కడ స్త్రీని గౌరవిస్తారో, అక్కడ దేవతలు తిరుగుతారని అంటారు మన పెద్దలు. స్త్రీని గౌరవించడం చాలా మంచిది. నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే అపవాదును మోస్తూనే ఉన్నాం. స్త్రీలు వాళ్ళ హక్కులకోసం పోరాడుతున్నారు కూడా. అయితే మహిళను గౌరవించడమంటే కేవలం హక్కులు ఒక్కటే ఇవ్వడం అని కూడా కాదు. అసలు స్త్రీ కి ఉన్న ప్రాధాన్యత, ఆమెను ఎలా చూస్తే ఆ కుటుంబం ఎత్తుకు ఎదుగుతుందో మన పురాణాలు బాగా చెప్పాయి.

Bhishma kathaకృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరా శక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది అత్యంత ఆదరాభిమానాలు పొందిన స్త్రీలుగా చరిత్రలో నిలిచిపోయారు. ఇక కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, కౌరవులకు చెప్పాడు. వాటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Rama sithaప్రతీ కుటుంబంలో స్త్రీని చాలా సంతోషంగా ఉంచాలి. అలా సంతోషంగా ఉంచడం వలన ఆ కుటుంబంలో సుఖ సంతోషాలుంటాయి. ఏ కుటుంబంలో ఉండే స్త్రీలనయినా ఆ కుటుంబ సభ్యులు తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆమె వల్లే ఆ కుటుంబానికి మంచి పేరయినా, చెడ్డ పేరయినా వస్తుంది. కనుక ఆమె తెచ్చే పేరుకు కుటుంబమే బాధ్యత వహించాలి.

Bhishma kathaమహిళలకు వ్యతిరేకంగా పురుషులు ఏమీ చేయరాదు. మహిళలు శాపం పెడితే పురుషులు ఇబ్బందులు పడతారు. స్త్రీ గౌరవించబడని సమాజం నాశనమవుతుంది. స్త్రీలకు కచ్చితంగా గౌరవం ఇవ్వాలి. అందుకు రామాయణమే ఉదాహరణ. ఏ కుటుంబంలో అయితే స్త్రీ సంతోషంగా ఉండదో వారికి కష్టాలే ఉంటాయి. అన్నీ నష్టాలే కలుగుతాయి.

Bhishma kathaగర్భంతో ఉన్న స్త్రీలకు, పేద కుటుంబానికి చెందిన స్త్రీలకు ఇంకా ఎక్కువ మర్యాద ఇవ్వాలి. వారికి ఇబ్బందులు కలిగించకూడదు. సమాజంలో ఉన్న ఇతర స్త్రీలను కూడా కచ్చితంగా గౌరవించాలి. లేదంటే వారి వల్ల కష్టాలు కలుగుతాయి. ఒక స్త్రీ మనకు ఏమీ కాకపోయినా ఆమెకు రక్షణగా ఉండాలి.

Bhishma kathaఇలా బీష్ముడు స్త్రీల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను పాండవులకు, కౌరవులకు చెప్పాడు.

SHARE