ఆధ్యాత్మికంగానే కాదు బిల్వ పత్రాలు ఔషధపరంగానూ పూజనీయమే!

మారేడు పత్రాలు లేదా బిల్వ పత్రాలను చూడగానే పరమశివుడు గుర్తొస్తాడు. శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మారేడు పత్రాలను చాలామంది పూజలో వాడటం చూస్తూ ఉంటాం. శివాలయాలకు వెళ్లేవారు, లింగానికి అభిషేకం చేసేవారు తప్పక మారేడు దళాలు వెంటబెట్టుకు వెళతారు. బిల్వ ఆకులు… మూడు ఆకులు కలిసి ఒకే ఆకుగా ఉంటాయి. అందుకే వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే శివుడికి మూడు కళ్లు ఉంటాయని పురాణ కథలున్నాయి.

3.bilipatra beal health benefitsఅయితే ఈ బిల్వ పత్రాలు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్య పరంగాను ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంది.
ఈ చెట్టు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధాలుగా ఆయుర్వేదంలో ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మనుషులకు మేలు చేసే ఆయుర్వేద గుణాలున్నదే. ఈ మారేడు చెట్టుకు కాసే కాయలు వెళక్కాయల లాగా ఉంటాయి. లోపల గుజ్జు కూడా ఉంటుంది. దినినే వెలగ అని కూడా అంటారు. దీని పండ్లు చూడడానికి చెక్కతో చేసినట్టు ఉంటాయి.

6.bilipatra beal health benefitsకాయగా ఉన్నప్పుడు రుచిలో వగరుగా,పుల్లగా ఉంటే పండినపుడు తీపి పులుపు రుచిలో ఉంటుంది. చాలా మందికి మారేడు కేవలం దేవుడి పూజ కోసమే అనే అభిప్రాయం ఉంది. కానీ దానిలోని ఔషధగుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. అతిసార వ్యాధికి మారేడు పండ్లతో చేసిన రసం చాలా మంచి మందు. మారేడుపండు నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇన్ఫెక్షన్లు ఇబ్బందులనుండి ఉపశమనం ఇస్తుంది.

దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తుంది. మారేడు ఆకులు కొద్దిపాటి జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి అవసరం మేరకు కొంచం తేనె కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. బిల్వ ఆకుల రసం తాగితే చాలు… ఒంట్లో వేడి పోతుంది. మారేడుదళం… గాలిని, నీటిని వడకట్టి కాలుష్యరహితము చేస్తుంది. అనేక వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

5.bilipatra beal health benefitsఅమీబియాస్ తో బాధపడేవారికి మారేడు చాలా మంచి చేస్తుందని చెప్పవచ్చు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఆహారం తీసుకున్న వెంటనే విరేచనానికి వెళ్ళవలసి వచ్చినా, మలబద్దక సమస్యతో బాధపడినా గ్యాస్ పెరగడం, పేగు పూత, కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ అమీబియాస్ వ్యాధి లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదు.

8.bilipatra beal health benefitsమారేడు పండు రసాన్ని తాగితే… ఎండాకాలంలో బాడీలో ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది. వేసవికి దీన్ని కూల్ డ్రింక్‌గా చెబుతారు. మారేడు పండులో గుజ్జు బయటకు తియ్యండి. దాన్ని మిక్సిలో వేసి జ్యూస్ చేసుకొని తాగేయడమే. ఇందులో కొద్దిగా నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కాస్త పంచదార వేసుకొని తాగితే వేసవిలో ఉపశమనం కలుగుతుంది. శరీరానికి వెంటనే చలవ చేస్తుంది.

బిల్వ పండుతో డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. మారేడు పండు కన్నా, లేత కాయ ఎక్కువ గుణాలు కలిగి ఉంటుంది. మారేడు ఆకుల్ని దంచి, ఆ రసాన్ని తాగితే షుగర్ వ్యాధి ఉన్నవారికి గొప్ప మేలు చేకూరుస్తుంది. ఈ మారేడు రసాన్ని రోజు కొద్దికొద్దిగా మోతాదు పెంచుకుంటూ తాగడం వల్ల షుగర్ క్రమబద్ధీకరించుకోవచ్చు. హైపర్ టెన్షన్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బు సమస్యలతో బాధపడేవారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.

7.bilipatra beal health benefitsమారేడు కాయను దంచి నీళ్లలో మరిగించి పటికబెల్లం కలుపుకుని తాగితే ఎంతగానో వేధించే ఎక్కిళ్ళు కూడా ఆగుతాయి. అంతేకాదు కడుపులోను, పేగులలోని అల్సర్పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, పండ్లకు ఉన్నది. తాజా మారేడు ఆకులను దంచి రసం తీసి ఆ రసంలో కొద్దిగా ఉప్పు చేర్చి తాగితే నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి తగ్గుతుంది. ఆయుర్వేదములో వాడే పది ముఖ్యమైన వేర్లలో దీని వేరు కూడా ఒకటి. రక్తమొలలకు ఈ వేరుపొడి మంచి ఔషధం.

2.bilipatra beal health benefitsముఖం మెరవాలన్నా… జుట్టు రాలడం తగ్గాలన్నా… బిల్వ పండు తినవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ ఈ మేలు చేస్తాయి. బిల్వ ఆకులు, పండు రసాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే… ముఖం మెరుస్తుంది. ముఖంపై మచ్చలు, జిడ్డు వంటివి పోతాయి. బిల్వ ఆకుల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదం కలిగిస్తుంది. బిల్వ ఆకుల రసం తాగితే… జుట్టు రాలడం తగ్గుతుంది. బిల్వ ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించి… ఓ అరగంట తర్వాత కడిగేసుకుంటే కూడా… జుట్టు మెరుస్తుంది. నల్లబడుతుంది.

1.bilipatra beal health benefitsమారేడు కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల వాంతులను తగ్గిస్తుంది. మారేడు చెట్టు వేరును నీళ్లలో మరిగించుకుని పంచదార కలుపుకుని తాగితే ఎంతటి వాంతులు అయినా నివారణ అవుతాయి. అలాగే మారేడు వేర్లు, బెరడు, చెట్టు ఆకులను ముద్దగా నూరి గాయాల మీద రాస్తే గాయాలు త్వరగా మానుతాయి. క్రిమి, కీటకాలు, విషపురుగుల యొక్క విషానికి ఈ ఆకులరసం విరుగుడుగా పనిచేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR