Home Health బంగాళ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల‌న బీపీ పెరుగుతుందా ?

బంగాళ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల‌న బీపీ పెరుగుతుందా ?

0
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఎక్కువగా కనిపించే దుంప కాయగూరల్లో బంగాళదుంప తప్పనిసరిగా ఉంటుంది. ఏ ప్రాంతం వారైనా, ఏ రకమైన వంటలైనా బంగాళదుంప ఉండాల్సిందే. వీటితో కూరలు, వేపుడు మాత్రమే కాదు పరోటా, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ అంటూ ఎన్నో రకాల స్నాక్స్ తయారుచేసుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆలుని ఇష్టంగా తింటారు. కేవలం రుచి కోసమే కాదు ఇందులో పోషకపదార్థాలు కూడా మెండుగానే ఉంటాయి.
BP Increase Due To Eating Potatoes
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు, పీచు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ధయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి6, విటమిన్-సి లభ్యమవుతాయి.  కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బంగాళా దుంప చాలా తేలికగా జీర్ణమవుతుంది. దీంతో పిల్లలకి, పేషెంట్లు కి దీనిని పెట్టడం వల్ల సులువుగా ఇది అరుగుతుంది. పైగా శక్తి కూడా ఇస్తుంది.
కడుపు లో మంటను తగ్గించడానికి బంగాళ దుంప బాగా పని చేస్తుంది. ఆమ్లతను తగ్గించడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయని, కడుపులోని ఇతర సమస్యలను తొలగిస్తుందని ఒక అధ్యయనం కనుగొంది. నోటి క్యాన్సర్ కు చికిత్స గా కూడా బంగాళాదుంప ఉపయోపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.పచ్చి బంగాళదుంప ముద్దని కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కలుగుతుంది. గుండె జబ్బులు తగ్గించడానికి కూడా ఇది బాగా పని చేస్తుంది.
అయితే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బంగాళ‌ దుంప‌ల‌ను అధిక బ‌రువు ఉన్న వారు తిన‌కూడ‌దు.దూనిలో పిండిప‌దార్ధంతో పాటు పోటాషియం అధికంగా ఉంటుంది. అది అధిక‌ బ‌రువుకు దారితీస్తుంది. కాబట్టి బ‌రువు త‌గ్గాలి అని డైట్ పాటించేవారు వీటికి దూరంగా ఉండండి.
హై బీపీ రోగులు ఆలుగ‌డ్డ‌ల‌ను అస‌లు తిన‌రాదు. బంగాళ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల‌న బీపీ ఎక్కువ‌గా పెరిగే అవ‌కాశం ఉంది. వీటిని ఎక్కువ‌గా తిసుకోవ‌డం వ‌ల‌న‌ హై బీపీ లేనివారికి హై బీపీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నంటునారు సైంటిస్ట్ లు. హై బీపీ ఉన్న‌వారు తిన‌డం వ‌ల‌న ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్ర‌త‌రం అవుతుంది. వీటికి దూరంగా ఉండ‌టం వ‌ల‌న హై బీపీ పెర‌గ‌కుండా ఉంటుంది .అంతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అవయవాలు మరియు కండరాల భాగాల్లో సందుల్లో వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఇవే వాత నొప్పులుగా మారి ఇబ్బంది పెడతాయి. కీళ్ళ నోప్పులు ఉన్న‌వారు, బాడిపెన్స్ ఉన్న‌వారు బంగాళ దుంప తిన‌కుడ‌దు.
బంగాళ దుంపల‌లో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంట‌నే గ్లూకోజ్ ను ఎక్కువ‌గా విడుద‌ల చేస్తాయి. దాంతో ర‌క్తంలో చ‌క్కెర‌ల స్థాయిలు (షుగ‌ర్) ఒక్క‌సారిగా పెరుగుతాయి. కాబట్టి  డ‌యాబెటిస్ రోగులు ఆలుగ‌డ్డ‌ల‌కు దూరంగా ఉండాలి. డ‌యాబెటిస్ రోగులు ఇవే కాదు ఎటువంటి దుంపలు తిన‌కుడ‌దు .
బంగాళ దుంపను  ఉడికించి తీసుకోవడం వల్ల చక్కని పలితం ఉంటుంది. నూనెలో ఫ్రై చేసే చిప్స్ ను అతిగా తీసుకుంటే బంగాళాదుంప నూనెను ఎక్కువ పీలుస్తుంది. దీనివల్ల మన శరీరంలోకి నూనెలు అతిగా వెళతాయి. దీనివల్ల ముఖం గా జిడ్డుగా మారడం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో నూనెతో కూడిన చీముగుల్లలు రావడం, మొటిమలు వంటివి ఎక్కువ రావడానికి ఆస్కారముంటుంది.

Exit mobile version