Home Health నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసంతో చక్కటి పరిష్కారం

నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసంతో చక్కటి పరిష్కారం

0

ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే అంటే 25 సంవత్సరాలు వచ్చేసరికి ముఖం మీద ముడతలు వచ్చేసి ముసలివారుగా కనపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, కాలుష్యం,ఆహారపు అలవాట్లు, వంటివి దీనికి కారణాలు కావొచ్చు. ముడతలు రాగానే చాలా కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అయిన ఫలితం మాత్రం తాత్కాలికంగానే ఉంటుంది. అదే ఇంటి చిట్కాలను ఫాలో అయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

Cabbage to reduce wrinkles on the faceముడతలను తగ్గించటంలో క్యాబేజీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాబేజీ వంటకంగానే కాకుండా సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. నల్లగా మారిన చర్మానికి క్యాబేజీ రసం రాస్తే చక్కగా పనిచేస్తుంది. అయితే క్యాబేజీని పచ్చిగా నేరుగా ముఖంపై పూయకూడదు. దీని వాడకానికి కొన్ని పద్ధతులు పాటించాలి.

క్యాబేజీని శుభ్రంగా కడిగి రసం తీసుకోవాలి. ఒక స్పూన్ క్యాబేజీ రసంలో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే క్రమంగా ముడతలు మాయం అవుతాయి.

ఉడికించిన క్యాబేజీ తరుగును గుజ్జులా చేసి అందులో దూదిని ముంచి ముఖంపై నెమ్మదిగా మర్దనా చేస్తూ, పది నిమిషాల తరువాత కడిగేస్తే ముఖంపై పేరుకున్న నలుపు తగ్గుతుంది. క్యాబేజీని నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉడికించి తర్వాత ఆ నీటితో ముఖం శుభ్రం చేసుకొంటే చర్మం చాలా సున్నితంగా మరియు యవ్వనంగా కనబడుతుంది.

క్యాబేజిని ఆకులను తీసుకొని మిక్సర్ లో వేసి జ్యూస్ చేసుకోవాలి. రెండు చెంచాల క్యాబేజీ జ్యూస్ లో చిటికెడు ఈస్ట్ కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. అరగంట సేపు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే ముఖంలోని డస్ట్ ను తొలగించి ముఖం ప్రకాశవంతంగా తయారయ్యేలా చేస్తుంది.

క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.

ఒక స్పూన్ క్యాబేజీ గుజ్జులో రెండు స్పూన్ల కోడిగుడ్డు తెల్లసొన, ఒక స్పూను సోయాపిండి, ఒక స్పూను తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక కడిగేస్తే ముఖానికి మెరుపు రావడంతో పాటు ముడతలు కూడా తగ్గుతాయి.

 

Exit mobile version