Home Health అనేక ఔషధ గుణాలకు నిలయం అయినా బిళ్ల గన్నేరు ప్రయోజనాలు

అనేక ఔషధ గుణాలకు నిలయం అయినా బిళ్ల గన్నేరు ప్రయోజనాలు

0

ప్రకృతిలో మనకు ఎదురయ్యే ప్రతీ సమస్యకు పరిషేకం ఉంటుంది. మనం తెలుసుకోలేకపోతున్నాం కానీ ఎటువంటి అనారోగ్య సమస్యకైనా ఈ ప్రకృతిలో ఔషధం దొరుకుతుంది. అంతెందుకు మన పరిసరాల్లో పెరిగే చాలా మొక్కలు ఎంత విలువైనవో మనకు తెలియనే తెలియదు. అటువంటి అతి సాధారణ మొక్కల్లో ఒకటి బిళ్ళ గన్నేరు.

Health Benefits of billa ganneruఈ మొక్కను అందరం ఎప్పుడో ఓసారి చూసే ఉంటాం. ఎవరి ప్రమేయం లేకుండా దానంతటదే పెరిగే పూల మొక్క ఇది. రకరకాల అందమైన పూలతో ఈ మొక్క ఎప్పుడు పచ్చగా కనువిందు చేస్తుంటుంది. బిళ్ళగన్నేరును సంస్కృతంలో నిత్య కళ్యాణి, నిత్యా పుష్పి అని ఆంటారు. ఇది అనేక ఔషధ గుణాలు ఉన్న మొక్క. వేల సంవత్సరాలనుండి మన ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.

ఈ మొక్క పూలు తెలుపు మరియు గులాబీ రంగులో ఉంటాయి. ఈ మొక్క సంవత్సరమంతా పూలు పూస్తునే ఉంటుంది. ఈ మెుక్క పూలు అలంకరణకు ఉపయోగిస్తారు. కానీ ఈ మెుక్క వలన ఎవరు ఊహించలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బిళ్ళ గన్నేరు మొక్క పూలు, ఆకులు దగ్గర నుండి వేరు వరకు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంది.

ఈ మొక్కలో యాంటీ డయాబెటిక్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను ఉన్నాయి. బిళ్ల గన్నేరు కొన్ని ఆకులను పేస్టులా చేయాలి. ఆపేస్టును గాయాలు, పుండ్లపై 2,3 సార్లు రాస్తే తగ్గుముఖం పడుతాయి.

ఈ మొక్కలో దాదాపు 400 పైగా అల్కలాయిడ్ రసాయనాలున్నాయని ఉపయోగాపడతాయని తెలిసింది. వీటిలో వింకామైన్ అనేది ప్రదానమైన ఆల్కలాయిడ్. దీనికి రక్తాన్ని పలుచబరిచే గుణం జ్ఞానపకశక్తిని పెంచే గుణం ఉన్నాయి. అలాగే మన ఆయుర్వేదంలో కూడా దిన్ని పలురకాల వ్యాధుల నియంత్రణకు ముఖ్యంగా రక్తప్రసరణ సరిచేసేందుకు వాడేవారు.

బిళ్ల గన్నేరు మెుక్కవేళ్లను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఆపొడిని ఒక టీస్పూన్ తేనేతో కలపి ఉదయం పరగడుపున ,రాత్రి పడుకునే ముందు రోజురెండు సార్లు తింటే మధుమేహం తగ్గుతుంది. అలాగే నెల రోజుల పాటు చేస్తే మంచి మార్పులను మీరే గమనిస్తారు. బిళ్ళ గన్నేరుతో మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. బిళ్లగన్నేరు ఆకుల్ని లేదా పువ్వుల రేకుల్ని తీసుకోవడం ద్వారా షుగర్ ఆమడదూరం పారిపోతుంది. బిళ్ళగన్నేరు ఆకులను మెత్తగా నూరి రాసుకుంటే అలెర్జీ మాయమవుతుంది.

పురుగులు, కీటకాలు కుట్టిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్‌ని రాసినట్లైతే వాపు తగ్గిపోతుంది. చర్మ సమస్యలను బిళ్ళ గన్నేరు ఆకుల పేస్టును రాస్తే తొలగించుకోవచ్చు. ఈ మొక్క బెదురుడు పంటినోప్పి, నోటిలో వచ్చే పొక్కుల నుండి ఉపశమనానికి పై పూతగా వాడతారు.

బిళ్ల గన్నేరు ఆకుల నుంచి రసం తీసి 2 నుంచి 3 ఎంఏల్ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు తాగితే బీపీ, హైపర్ టెన్షన్ నయంమౌతాయి. కొన్ని ఆకులను తీసుకొని 2 కప్పుల నీటిలో బాగా మరిగించి స్త్రీలు నెలకోసారి తాగితే రుతు సమయంలో తీవ్ర రక్తస్రావం కాకుండా ఉంటుంది.

బిళ్ళ గన్నేరు మొక్క వేరుని తీసుకొని.. రెండు గ్లాసుడు నీటిలో వేసి సన్నని సెగ పైన పెట్టి కాషాయం లాగా చెయ్యాలి. ఆ కషాయం ఒక గ్లాసు వరకు వచ్చేదాక కాచిన తర్వాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో షుగర్ లెవెల్ తగ్గుతుంది. కిడ్నీలో వాపు, కిడ్నీ వ్యాధులు దూరమవుతాయి.

బిళ్ల గన్నేరు ఆకుల పోడికి, వేపాకు పొడి, పసుపు కలపి ముఖానికి పట్టిస్తే చాలు మెుటిమలు మాయం. ఇలా తరుచూ చేయడం వలన మెుటిమలు, మచ్చలు పోయి ముఖంకాంతివంతంగా, మృదువుగా మారుతుంది.

బిళ్ల గన్నేరు వేర్ల పోడిని, దానితో బిళ్ల గన్నేరు ఆకుల రసాన్ని రెండింటిని రోజు తగుతుంటే క్యాన్సర్ తగ్గుతుంది. బిళ్ల గన్నేరులో ఉండే పవర్ పుల్ యాంటీ ఆక్సీడెంట్లు క్యాన్సర్ కణాల వృద్దిని అడ్డుకుంటాయి. దీంతో క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది. ఈ మెుక్క ఆకులు లేదా పువ్వుల రసాన్ని రోజూ తీసుకుంటే ఆందోళన, ఒత్తిడి తగ్గితాయి. డిప్రెషన్ తగ్గి, చక్కగా నిద్రపోతారు.

Exit mobile version