గర్భిణీ స్త్రీ లకు కోవిడ్‌ టీకా ఇవ్వడానికి ఎన్ని రోజుల వ్యవధి తప్పనిసరి!

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. చిన్నాపెద్ద అనే తేడాలేకుండా అంద‌రినీ వెంటాడుతుంది. చివ‌ర‌కు వృద్దులు, ప‌సిపిల్ల‌లు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు గ‌ర్భిణీలు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నట్లుగా చాలా కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. అయితే, వారిలో చాలా మంది సుర‌క్షితంగా డెలీవ‌రి కావ‌టం, పుట్టిన బిడ్డ‌లు కూడా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ గ‌ర్భిణీలు వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌జారోగ్య సంక్షేమ శాఖ గ‌ర్భిణుల కోసం ప‌లు సూచ‌న‌లు చేసింది.

Can pregnant women be vaccinatedకరోనా వైరస్ దగ్గు, తుమ్ముల ద్వారా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే ఎవరైనా మీ దగ్గర్లో దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు వారి నుంచి దూరంగా వెళ్లండి. అదే విధంగా, మీరు దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు కర్చీఫ్‌ని అడ్డుపెట్టుకోండి. ముఖ్యంగా మాస్క్ ధరించాల‌ని సూచిస్తున్నారు. గ‌ర్భిణుల‌కు కోవిడ్‌-19 వైర‌స్ ఉంటే గ‌నుక అది క‌డుపులోని బిడ్డ‌కు ఏ స్థాయిలో ఉన్న‌ప్పుడు సోకుతుంద‌నేది ఇంకా నిర్ధార‌ణ కాలేద‌ని నిపుణులు చెబుతున్నారు.

Can pregnant women be vaccinated“గర్భిణీ స్త్రీలపై కరోనా ప్రభావం అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే ఉంది” అని అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు క్రిస్టినా ఆడమ్స్ వాల్డోర్ఫ్ తెలిపారు. వాషింగ్టన్ ఆధారిత అధ్యయనం ప్రకారం, కొరోనావైరస్ బారిన పడిన Pregnant ladies అనారోగ్యం సమస్యలతో ఆసుపత్రిలో చేరే ప్రమాదం 3.5 రెట్లు అధికంగా ఉందని అంచనా వేశారు.

Can pregnant women be vaccinatedప్రసూతి మరణాల రేటు వార్షిక జననాల కంటే ఎక్కువ. ఈ అధ్యయనంలో భాగంగా గతేడాది జూన్‌లో కరోనావైరస్ సంక్రమించిన 240 మంది గర్భిణీ స్త్రీల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించింది. వీరిలో ముగ్గురు మహిళలు కరోనావైరస్‌తో మరణించగా, 24 మంది రోగులు అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్టు వెల్లడైంది. అక్టోబర్ మధ్య నాటికి కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతూ మృతి చెందిన గర్భిణీల మరణాల సంఖ్య 6.7 శాతంగా నమోదైంది. ఇప్పుడైతే కరోనా టెస్ట్ లు చేసిన వారిలో సగం మందికి పాజిటివ్ గా తేలడంతో ఆందోళన పడుతున్నారు.

Can pregnant women be vaccinatedకరోనా మహమ్మారి వ్యాపించడం మొదలైనప్పటి నుండి COVID-19 తో వచ్చే ప్రధాన సమస్యలను గుర్తించడానికి శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తూనే ఉన్నారు. వృద్ధులు, సుదీర్ఘ వ్యాధులు ఉన్నవారు సంక్రమణ కారణంగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు కానీ తాజా పరిశోధనల అనంతరం గర్భం కూడా కరోనా వైరస్ రిస్క్ ఫాక్టర్స్ లో ఒకటైంది. కరోనా వ్యాపించాకా తొలి 8 నెలల కాలంలో ప్రేగ్నన్ట్ విమెన్ కు కరోనాతో ప్రత్యేకంగా వచ్చే ముప్పు ఏదీ లేదనే అనుకున్నారు కానీ ఇకపై గర్భం దాల్చనున్న మహిళలకు కరోనాతో కష్టాలు తప్పవని అధ్యయనాలు చెబుతున్నాయి.

Can pregnant women be vaccinated

  • ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే..చాలా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా చేతులను శుభ్రం చేసుకోవాలి.
  • ముఖ్యంగా ఏదైనా తినడానికి ముందు ముఖం మీద చేతులు పెట్టడానికి ముందు చేతులను బాగా కడుక్కోవాలి.
  • మీకు తుమ్ములు లేదా దగ్గు ఉంటే మోచేతులను అడ్డుగా పెట్టుకోండి. అనంతరం చేతులను మళ్లీ నీట్ గా కడుక్కోవాలి.
  • కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ప్రజా రవాణా (ట్రైన్, బస్సు)ను ఉపయోగించొద్దు.
  • రద్దీ ఉన్న ప్రాంతాలకు చాలా దూరంగా ఉండాలి. మీరు వాడిన టవ్వాళ్లు, సబ్బులు ఇతర వస్తువులను కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచండి. వ్యక్తిగత పరిశుభ్రతపై జాగ్రత్త పాటించాలి.
  • ఒకవేళ ప్రెగ్నెన్సీ మహిళలకు జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఏవైనా తీవ్రమైన ఇబ్బందులు ఉంటే.. మీకు కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  • ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి మందులను ఉపయోగించొద్దు. డాక్టర్లు సూచించిన వాటిని మాత్రమే వాడాలి.
  • కోవిద్-19 మహమ్మారి సమయంలో మానసిక ఒత్తిడిని నివారించాలి. మీరు ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువగా నడవండి. వీలైతే యోగా మరియు ధ్యానం చేయాలి.
  • మీ ఇష్టానుసారం మందులు తీసుకోకండి. ఎందుకంటే గర్భధారణ సమయంలో కొన్ని మందులు మీ ఆరోగ్యానికి, శిశువుకు మంచిది కాదు. మీరు ఏమైనా వాడదలిస్తే ముందుగా మీ వైద్యుడ్ని సంప్రదించండి.

ఈ తరుణంలో వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అయింది. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గర్బిణీలకు నష్టం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే అందులో ఎటువంటి నిజం లేదని ఇదివరకే పలు అధ్యయనాలు వెల్లడించాయి. నిపుణులు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. వ్యాక్సినేషన్‌ తర్వాత గర్భిణుల శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి చెందుతాయని, అవి గర్భంలోని శిశువుకు కూడా అందుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Can pregnant women be vaccinatedవ్యాక్సిన్‌ వేసుకోవడం వల్ల గర్భంలోని ప్లాసెంటాకు హాని జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ పరిశోధనతో గర్భిణులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గర్భం దాల్చిన తర్వాత 9 నెలల సమయంలో ఎప్పుడైనా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చని నిపుణలు చెబుతున్నారు.గర్భంలోని పిండం అవయవాలు అభివృద్ధి చెందిన తర్వాత అంటే.. సుమారు 12 నుంచి 20 వారాల తర్వాత తీసుకుంటే మంచిదని అంటున్నారు. అయినా ఏ నెలలోనైనా వ్యాక్సిన్ ఇవ్వోచ్చని తెలిపారు.

Can pregnant women be vaccinatedఇక, గర్భం దాల్చిన తర్వాత తల్లీ బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా తల్లికి ఫ్లూ వ్యాక్సిన్‌ ఇస్తుంటారు. అయితే అదే సమయంలో కరోనా టీకా కూడా ఇవ్వాల్సి వస్తే.. ఒకేసారి ఈ రెండూ ఇవ్వకూడదు. ఫ్లూ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి, కోవిడ్‌ టీకా ఇవ్వడానికి మధ్య కనీసం 15 రోజుల వ్యవధి ఉండాలి.

వ్యాక్సిన్ వేయించుకునే ముందు గర్భిణీ స్త్రీని పర్యవేక్షిస్తున్న డాక్టర్ సలహా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR