చదివింది గుర్తుండట్లేదా? సరస్వతి ఆకును ఇలా తీసుకోండి!

హిందూ మతంలో సరస్వతిని చదువుల తల్లిగా, జ్ఞాన ప్రదాయినిగా ఆరాధించుకుంటాము. ఆ దేవతామూర్తి పేరుతో ఉన్న చెట్టు కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందట. భూమిపై ఉన్న అనేక వృక్ష‌జాతుల్లో స‌ర‌స్వ‌తి మొక్క కూడా ఒక‌టి. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్క ఆకులను ప‌లు ఆయుర్వేద మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. 
సరస్వతీ మొక్క అంబెల్లిఫెరె కుటుంబానికి చెందిన ఒక ఔషధ మొక్క. ఇవి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, నీటివనరులకు దగ్గరలో పెరుగుతాయి. సరస్వతీ ఆకును ‘మండూకపర్ణి’ యని, సెంటెల్లా అని వ్యవహరిస్తారు. దీన్ని ఇంట్లో కూడా మ‌నం పెంచుకోవ‌చ్చు. ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకుతో దైవాన్ని పూజించడం వల్ల అంతా శుభమే జరుగుతుందట. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట.
మరి ఈ మొక్క మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స‌ర‌స్వ‌తి మొక్క పేరుకు త‌గిన‌ట్లుగానే ప‌నిచేస్తుంది. ఈ మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. నిత్యం 4 స‌రస్వ‌తి ఆకులను అలాగే న‌మిలి తింటే మేథ‌స్సు పెరుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది.
రకాన్నిశుద్దీకరిస్తుంది. నిత్యం ఈ మొక్క ఆకుల ర‌సం తాగితే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్తం శుభ్రంగా మారుతుంది. అంతేకాదు  స‌రస్వ‌తి ఆకుల ర‌సాన్ని నిత్యం తాగితే ఆయుష్షు పెరుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. మాన‌సిక ఒత్తిడి, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం ఈ ఆకుల‌ను తింటే ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.
ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు, బ్రాహ్మీఘృతము, సరస్వతారిష్ఠము, బ్రాహ్మరసాయనము, బ్రాహ్మీతైలము మొదలగు ఆయుర్వేద ఔషధాలు తయారుచేస్తారు. ఇవి నరాలకు బలాన్ని కలుగజేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. ఉన్మాదము, అపస్మారము మొదలగు మానసిన వ్యాధులలో ప్రయోజనకారి. స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి అందులో తేనె క‌లిపి తీసుకుంటే.. గొంతు బొంగురు త‌గ్గుతుంది. స్వ‌ర‌పేటిక వృద్ధి చెందుతుంది. మంచి కంఠ స్వ‌రం కూడా వ‌స్తుంది.
కొద్దిగా వాము తీసుకుని పొడి చేసి అందులో స‌ర‌స్వతి మొక్క ఆకుల ర‌సాన్ని క‌లిపి తినాలి. దీంతో కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. ఈ మొక్క‌ల ఆకుల‌ను మ‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి త‌రువాత వాటిని తీసి ఎండ‌బెట్టి అనంత‌రం వాటిని పొడి చేయాలి. ఈ పొడిని నిత్యం టానిక్‌లా పిల్ల‌ల‌కు ఇవ్వాలి. దీంతో వారికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది.  ఈ ఆకు పొడి పిల్లల ఆకలిని పెంచుతుంది. విద్యార్థులు ఈ మొక్క ఆకుల‌ను బాగా న‌లిపి ర‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగాలి. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చ‌దువుల్లో బాగా రాణిస్తారు.
సరస్వతి మొక్క‌ ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదంపప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేయాలి. తరువాత ఆ మిశ్ర‌మాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి అనంత‌రం వ‌చ్చే ద్ర‌వంలో తగినంత తేనె కలిపి తాగాలి. ఇలా 40 రోజులపాటు రోజూ ఉదయం తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ ఔషధాన్ని మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది.
సరస్వతి ఆకు పొడి – 50 గ్రాములు మరియు మిరియల పొడి – 3 గ్రాములు కలిపి నిలువ చేసుకుని, ప్రతి రోజు పిల్లలకు ఉదయం పరిగడుపున 4 చిటికెల పొడి ,1 స్పూన్ ఆవు పాలతో లేదా గోరువెచ్చని నీటిలో వెసి కొంచెం పటిక బెల్లం కలిపి త్రాగించాలి. ఇలా రోజూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సర్వసతి మొక్క గురించి పురాణాలలో కూడా ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR