బ్లాక్ ఫంగస్‌కు కారణమేమిటి మరియు దాన్ని ఎలా నివారించవచ్చో తెలుసా ?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మహమ్మారి ఉధృతి కొనసాగుతుండగానే మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డట్టు బ్లాక్ ఫంగస్ వచ్చి పడింది. ఒకవైపు కరోనా విలయతాండవం చేస్తుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ విరుచుకుపడుతోంది. ప్రాణాంతకంగా మారిన బ్లాక్ ఫంగస్ ముఖ్యంగా కోవిడ్ రోగుల్ని టార్గెట్ చేస్తోంది. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఎక్కువగా ఈ వ్యాధి కన్పిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే రోగనిరోధక శక్తి తగ్గుతున్న వారితో పాటు స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలోనూ బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుండి కేవలం విటమిన్ మాత్రలతో కోల్కొన్న వారికి ఈ వ్యాధి రాదు. దురదృష్టవశాత్తూ కొంత మంది ఇమ్మ్యూనిటిని నమ్ముకోరు. స్టెరాయిడ్స్ మీదే ఆధారపడుతున్నారు.

cause of black fungus and how to prevent it?నిజానికి కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన గత ఏడాది నుంచి స్టెరాయిడ్స్ వాడకంపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా సోకి తీవ్రమైన వారికి చికిత్సలో భాగంగా అధిక శక్తి కలిగిన స్టెరాయిడ్‌లు ఇస్తారు. కరోనా నివారణలో భాగంగా బలమైన స్టెరాయిడ్ మందులు వాడిన వారికి వ్యాధి నిరోధక శక్తి బలహీన పడడం వల్ల గాలిలోని ఈ బూజు సోకి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. షుగర్, కాన్సర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటి వ్యాధులు ఉండి కరోనా సోకి నెగటివ్ వచ్చిన వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

cause of black fungus and how to prevent itఇలాంటి వ్యాధులు ఉన్నవారికి ఇమ్యూనిటీ వ్యవస్థ బలహీనముగా ఉండడమే కారణం. దీని వల్ల గ్లూకోస్ రీడింగ్ ఒక్క సారిగా మూడు నాలుగు వందలు దాటే ప్రమాదం వుంది. అయితే కరోనా వల్ల ప్రాణం పోయే స్థితి ఉంటే అప్పుడు పెద్ద నష్టాన్ని నివారించడానికి ఈ చిన్ననష్టం తప్పదు అనే ప్రాతిపదికన డాక్టర్ లు స్టెరాయిడ్ లు వాడుతారు.

cause of black fungus and how to prevent it?ఇప్పుడు ఆర్‌‌‌‌ఎంపీ నుంచి కార్పొరేట్ హాస్పిటళ్లలో పెద్ద డాక్టర్ల వరకూ కరోనా ట్రీట్మెంట్లో వాడుతున్నవి స్టెరాయిడ్స్. అయితే.. వీటిని అతిగా, అనవసరంగా వినియోగించడం వలనే పేషెంట్ల కండీషన్ సీరియస్ అవుతోందని డాక్టర్స్ చెబుతున్నారు. చాలా మందికి షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతున్నాయి. ఆ ఎఫెక్ట్‌‌తో కిడ్నీలు ఖరాబైతున్నాయి. ఇమ్యూనిటీ లెవల్స్‌‌ పూర్తిగా పడిపోతున్నాయి. తొలుత కేవలం మధుమేహంతో బాధపడుతున్నవారిలోనే మ్యూకర్ మైకోసిస్ అనబడే బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులను గుర్తించారు, ఆ తరువాత క్యాన్సర్ బాధితులు, కిమోథెరపి చేయించుకున్న వారిలో రోగనిరోధక శక్తి క్షణీంచడంతో బ్లాక్ ఫంగస్ సమస్య బారిన పడుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

cause of black fungus and how to prevent it?మ్యూకర్ మైకోసిస్ వంటి ఫంగల్ వ్యాధులు దాడి చేసినప్పుడు శరీరం తట్టుకోలేని స్థితికి చేరుకుంటున్నది. పైగా థైరాయిడ్‌‌, ఆర్థరైటీస్‌‌ వంటి అనేక జబ్బులు చుట్టుముడుతున్నాయి. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌‌ అయి ఇంటికి చేరుకున్నాక నాలుగైదు రోజులకో, నాలుగైదు వారాలకో ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇలాంటి సమస్యలతో వందల మంది మళ్లీ హాస్పిటళ్ల బాట పడుతున్నారు. అనేక మంది పరిస్థితి క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా నిజమే అయినప్పటికీ కరోనా నుంచి బయటపడేసేందుకు స్టెరాయిడ్స్‌‌ తప్ప మరో మార్గం లేదని, అయితే వాడే విధానం సరిగ్గా లేకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు.

cause of black fungus and how to prevent it?స్వల్ప కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన వారికి అందుకు తగిన మెడిసిన్ ఇవ్వాలని, స్టెరాయిడ్స్ వాడకూడదని సూచిస్తున్నారు. లేనిపక్షంలో మ్యూకర్ మైకోసిస్ వీరిపైనా దాడిచేసి బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌కు దారి తీస్తుందన్నారు. కోవిడ్19 బాధితులు స్టెరాయిడ్స్ అధికంగా తీసుకోవడం ద్వారా ఏ ఫలితం ఉండదని, రక్తంలో చక్కెర స్థాయి పెరిగడంతో, అనవసరంగా బ్లాక్ ఫంగస్ దాడికి గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని హెచ్చరించారు. వాటిని విచ్చలవిడిగా వాడితే ప్రమాదం అంటున్నారు. ఇక నేరుగా మెడికల్ షాప్ కు వెళ్లి కొనుక్కని వాడడం అంటే కోరి కొరివి తో తలగోక్కున్నట్టే అంటున్నారు.

cause of black fungus and how to prevent it?కాగా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ ని నోటిఫైబుల్ డిసీజ్ అని తెలంగాణ సర్కారు ప్రకటించింది. తెలంగాణలో ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ (Mucormycosis) కేసులు నమోదైతే తమకు తప్పకుండా సమాచారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తిస్తే తెలంగాణ వైద్యశాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ని ఆరోగ్య శ్రీ లో కలపడం జరిగింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR