ఆంజనేయుడు మకరధ్వజ మధ్య యుద్దానికి కారణం

రామ రావణుల యుద్ధం ప్రారంభం అయినప్పుడు ఒక సన్యాసి స్వర్ణ లంక మీదికి యుద్ధానికి వచ్చాడు. చాలా సులభంగా అతన్ని ఓడించవచ్చు అన్న అహంకారంతో రావణుడు యుద్ధం చేసాడు. కానీ సన్యాసి రూపంలో వచ్చింది సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. ఆ విషయం అర్ధం చేసుకోవడానికి రావణుడి పరివారాన్ని మొత్తాన్ని పోగొట్టుకోవలసి వచ్చింది. రాముణ్ణి జయించడం అసాధ్యం అనుకున్న రావణుడు, వెంటనే పాతాళ లంకాధిపతి అయిన తన మేనమామ రావణుడి సహాయాన్ని ఆర్ధిస్తాడు.

Cause Of The War Between Hanuman And Makardhwajరామ లక్ష్మణులను నీ మాయల చేత బంధించి పాతాళానికి తీసుకొచ్చి నిర్జించమని అర్ధిస్తాడు. మేనమామ పైగా రావణుడు అంతటివాడు తనని సహాయం అడగడంతో తక్షణమే రామ లక్ష్మణులను బంధించి తీసుకొస్తాను అని హామీ ఇస్తాడు. రాత్రి సమయాల్లో రామ లక్ష్మణులతోపాటు మొత్తం వానర సైన్యానికి హనుమంతుడు తన వాలంతో శత్రు దుర్భేద్యమైన ప్రాకారాన్ని నిర్మించి రక్షిస్తున్నాడు. సామాన్యులు అందులోకి ప్రవేశించలేరు. మైరావణుడు తన అనుచురుడైన సూచీముఖుడనే (సూది వంటి ముఖం ఉన్నవాడు) రాక్షసుడిని పిలిచి నీ సూది వంటి ముఖంతో భూమిని తవ్వి ప్రాకారంలోకి ప్రవేశించి రామ లక్ష్మణులను మూర్ఛిళ్లేలా చేసి పెట్టెలో పెట్టుకొని తీసుకురా అని ఆదేశిస్తాడు. సూచీముఖుడు వెంటనే బయలుదేరాడు.

Cause Of The War Between Hanuman And Makardhwajభూమిని తవ్వడం ప్రారంభించాడు. అయితే హనుమ వాలము తగిలి ముఖము పగిలి తిరిగి పాతాళ లోకానికి వెళ్లిపోతాడు. తర్వాత మైరావణుడు మూషికముఖుణ్ణి, పాషాణ బేధి అనే రాక్షసుల్ని పంపిస్తాడు. కానీ వజ్ర ప్రాకారం అయిన ఆంజనేయుని వాలాన్ని ఏమి చేయలేక తలలు పగిలి తిరిగి పాతాళ లోకానికి చేరారు. చేసేదేం లేక మైరావణుడే స్వయంగా వచ్చి మహా మాయవి కావడం చేత విభీసునుడి వేషంలో హనుమంతుని అనుమతి తీసుకొని రామ లక్ష్మణులని తన ముత్తు ఔషదాలతో మూర్ఛిళ్ల చేసి పెట్టెలో బంధించి తీసుకెళ్తాడు. కాసేపటి కి నిజమైన విభీషణుడు వచ్చి “రామ లక్ష్మణుల్ని చూసి వస్తాను” అంటాడు. హనుమకు చిత్రంగా అనిపించి “ఇప్పుడే కదా వెళ్లి వచ్చారు తిరిగి అంతలోనే వచ్చారు. ఏమిటి మీ ఉద్దేశం” అని అడుగుతాడు.

Cause Of The War Between Hanuman And Makardhwajదానికి విభీషణుడు హతాశుడై “నేను రావడం ఏమిటి? ఇప్పుడే వస్తున్నాను”. అంటాడు. ఎదో కీడు జరిగిందని ఇద్దరూ లోపలికెళ్లి చూస్తే రామ లక్ష్మణుల కనిపించరు. ఆంజనేయుడు కుప్పకూలిపోతాడు. నా కన్ను కప్పి నా స్వామిని అపహరించిన ఆ దుర్మార్గుడు ఎవరు అంటూ మహోగ్రరూపుడై పైకి లేస్తాడు. అప్పుడు విభీషణుడు ఈ పని ఖచ్చితంగా మహా మాయవి పాతాళ లంక అధిపతి అయిన మైరావణుడి పనే అయి వుంటుంది. అక్కడికి వెళ్లే మార్గం తెలుసుకొని పరమ భక్తి ప్రసన్నంతో నరులు ఎవరూ ప్రవేశించలేని పాతాళ లంకకు చేరుకుంటాడు. హనుమంతుని ప్రవేశంతో మైరావణ దుర్గంలో శబ్ధాలు వినగానే రాక్షసులు హోరుమని పెద్దపెట్టున శబ్దం చేస్తూ వివిధరకాల ఆయుధాలతో హనుమతో యుద్ధానికి దిగారు.

Cause Of The War Between Hanuman And Makardhwaj హనుమ వారినందరినీ హతమార్చి యుద్ధం కొనసాగించాడు. అప్పుడు ఒకరాక్షస యోధుడు హనుమతో ఘోరంగా యుద్ధం చేసాడు. చాలాసమయం యుద్ధం జరిగిన తరువాత హనుమ అలసిపోయాడు. హనుమకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు హనుమ యుద్ధం ఆపి ” మహావీరా ! నాకు సాధారణంగా యుద్ధంలో అలసట కలగదు. అలాంటి నాతో అలసిపోయే అంతగా యుద్ధం చేయగలిగిన నీవు ఎవరు? ” అని అడిగాడు. అప్పుడా యోధుడు హనుమతో ” మా తల్లి ఒక అప్సర కన్య. ఒకానొకప్పుడు మాతంగ మహర్షి శాపానికి గురి అయింది. మా తల్లి మహర్షిని శాపవిమోచనం ఇమ్మని ప్రార్ధించడంతో మహర్షి మా తల్లితో ” నీవు సముద్రంలో దీర్ఘకాయురాలివై సంచరించే సమయంలో ఒకసారి దైవకార్యం కోసం హనుమ సముద్రం దాటి పోయే సమయంలో జారిపడిన స్వేదబిందువు వల్ల నీవు పుత్రుడికి జన్మ ఇచ్చిన వెంటనే నీకు శాపవిమోచనం కలుగుతుంది ” అని చెప్పాడు.

Cause Of The War Between Hanuman And Makardhwajఒకానొక సమయంలో రామకార్యార్ధం నీవు సముద్రం దాటే సమయంలో నీ నుదుటి నుండి జారిపడిన స్వేదబిందువుని గ్రహించిన నా తల్లి చేప రూపంలో నాకు జన్మ ఇచ్చింది. నేను పుట్టిన వెంటనే మా అమ్మ నాతో ” కుమారా ! నీవు మైరావణుడి వద్దకు వెళ్ళి అతడిని సేవించు. అక్కడకు వచ్చి నీతో యుద్ధంచేసి అలసట చెందిన వీరుడే నీ తండ్రి ఆని గుర్తించు ” అని చెప్పింది. అందువల్ల ” నాతో యుద్ధం చేసి అలసట చెందవు అని చెప్పావు కాబట్టి నీవు ఆ ఆంజనేయుడివై ఉండాలి ” అన్నాడు. వెంటనే ఆంజనేయుడు ఆయోధుని పుత్రప్రేమతో ఆలింగనం చేసుకుని ” కుమారా ! ఆ ఆంజనేయుడిని నేనే. నీ తండ్రిని నేనే ” అని చెప్పాడు. అతడు ఆంజనేయుని పాదాలకు నమస్కరించి ” తండ్రీ ! నేను ఏమి చేయాలో ఆజ్ఞ ఇవ్వండి ” అని అడిగాడు.

Cause Of The War Between Hanuman And Makardhwajఅప్పుడు మారుతి నన్ను మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకునిపో అని అడిగాడు. కుమారుడు మత్స్య వల్లభుడు ఆంజనేయుని మైరావణుడు ఉన్న ప్రదేశానికి తీసుకుపోయాడు. ఆంజనేయుడు మైరావణునితో పోరు సాగించాడు. ఇరువురి మద్య చాలా సమయం తీవ్రమైన పోరు సాగింది. చివరకు ఆంజనేయుడిది పైచేయి అయింది. ఎన్ని మార్లు మైరావణుని ముక్కలు చేసినా మైరావణుడు తిరిగి ఒక్కటిగా మారుతూ ఉన్నాడు. ఇది గమనించి హనుమ ఆశ్చర్యచకితుడుకాగా మైరావణుడి చెల్లెలు దుర్దండి ” మహావీరా ! కలవర పడకు. మైరావణిని పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో బిలంలో దాచబడి ఉన్నాయి. అవి బయటకు రాకుండా బిలద్వారం మీద ఒక రాయితో మూతపెట్టి ఉంది. నీవు ఆ రాతిని కాలితో తన్ని తుమ్మెదలు వెలుపలికి రాగానే వెంటనే వాటిని కాలితో తొక్కి వేస్తే మైరావణుడు హతుడుకాగలడు ” అని చెప్పంది.

Cause Of The War Between Hanuman And Makardhwajఅది విన్న మైరావణుడు ” దుర్మార్గురాలా ! చెల్లెలివైయుండి ఇలా ఇంటి గుట్టు రట్టు చేస్తావా ! ఇది ధర్మమా ! ” అని అడిగాడు. దుర్దండి ” నీ తోడపుట్టిన చెల్లెలిని. నాకుమారుడు రాజవుతాడని జ్యోతిష్కులు చెప్పినందుకు నన్ను, నా కుమారుడైన నీలమేఘుని గొలుసులతో బంధించిన నీ ప్రాణరహస్యం చెప్పడం అధర్మమేమి కాదు ” అని చెప్పింది. హనుమ వెంటనే ఆరాతిని కాలితో తన్నగానే ఐదు తుమ్మెదలు వెలుపలికి వచ్చాయి. ఆంజనేయుడు ఆతుమ్మెదలను కాలితో నొక్కి చంపగానే మైరావణుడు కుప్పుకూలాడు. ఆంజనేయుడు దుర్దండి కుమారుడైన నీలమేఘుడికి పాతాళలంక రాజుగా పట్టాభిషేకం చేసి రామాక్ష్మణులను భుజంమీద ఎక్కించుకుని అక్కడి నుండి లంకకు వెళ్ళాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR