రాధే శ్యామ్ ట్రైలర్ చూసారు కదా! మీకు అయితే ఎలా ఉందో తెలీదు కానీ, నాకు మాత్రం చాలా ఉత్సాహంగా ఉంది. రియల్ ఇన్సిడెంట్స్కి ఫిక్షన్ జత చేసి రాధ కృష్ణ ఎదో అద్భుతం చేయబోతున్నాడు అనిపిస్తుంది.
ఇండియన్ టైటానిక్ అవుతుందో లేదో నాకైతే తెలీదు కానీ, రాధే శ్యామ్ ట్రైలర్ లో కనిపించిన “Davinci” మాత్రం నాలో ఉత్కంఠ రేకెత్తించింది. Davinci ఏంటండి బాబు అంటారా! ట్రైలర్ లో ఒక షిప్ పేలిపొయ్యి, మునిగిపోవడం చూసారు గా, ఆ షిప్ పేరే Davinci.
నిజంగానే Davinci పేరు మీద షిప్ ఉంది, అది కూడా ఇలానే బ్లాస్ట్ అయ్యి చాలా మంది ప్రాణాల్ని సముద్రంలో కలుపుకుందని మీకు తెలుసా!
World War 1 ప్రారంభ దశలో ఇటాలియన్ రాయల్ నేవీ కొరకు యుద్ధ రంగంలో భాగంగా మూడు battleships ని తయారుచేశారు. వాటి పేర్లు Conte Di Cavour, Giulio Cesare, Leonardo da Vinci.
18 జులై 1910 లో Davinci ని కట్టడం ప్రారంభించి, మే 17, 1914 నాటికి పూర్తి చేశారు. World War 1 ప్రారంభం అయ్యే నాటికి Davinci సిద్ధం అయ్యింది. కానీ కొన్ని నెలలు పాటు యుద్ధం లో పాల్గొనే అవకాశం రాక కేవలం anchor గానే పని చేసింది.
August 1916 Taranto హార్బర్ లో ammunition ని నింపుతున్న సమయంలో ఏర్పడ్డ internal explosion కారణంగా Davinci షిప్ తలకిందులు అయ్యింది. కాసేపు సముద్రంతో పోరాడి Davinci మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది స్టాఫ్, 227 మంది సొసైటీ లో పేరు పొందిన వారు చనిపోయారు. 248 మంది సముద్రం గర్భంలోకి వెళ్లిపోయారు. ఈ బ్లాస్ట్ ఎన్నో political conspiracy లకి దారి తీసింది.
ఇటాలియన్ రాయల్ నేవీ Davinci ని బైటకి తియ్యడానికి పనులు మొదలు పెట్టింది, మొత్తానికి 17 సెప్టెంబర్ 1919 లో Davinci refloat అయింది.
Davinci కి మళ్లీ ఎన్నో కసరత్తులు చేసి బారి యుద్ధ నవక గా సిద్ధం చెయ్యడానికి ప్రయత్నించారు ఇటాలియన్ రాయల్ నేవీ, కానీ ఫండ్స్ లేకపోవడంతో 22 మార్చ్ 1923 స్క్రాప్ కింద అమ్మేశారు.
ఇదంతా సినిమా లో ఉండదు కానీ Davinci షిప్ కధ కి ఫిక్షన్ జోడించి రాధ కామెరాన్ యే మ్యాజిక్ చేస్తాడో చూడాలి…