ఎస్పీబీ – శ్రీ పండితారాద్యుల బాలసుబ్రమణియం ఈ పేరు సంగీతంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ రోజు ఆ గొంతు మూగబోయింది అని ఎవరు జీవించుకోలేకపోతున్నారు….గడిచిన అయిదు దశాబ్దాల నుండి మన అందరిని అలరించిన ఆ గొంతు ఇక వినిపించదు అన్న వార్త వినడానికి ఎంతో చేదుగా ఉన్న అది నిజం.
బాలు గారు మన భువి కి దిగివచ్చిన ఒక అద్భుతమైన గాయకుడు…తనగాత్రంతో అశేష జన హృదయాలను రంజింప చేసిన ఆయన…చనిపోతూ కూడా మన అందరికి ఎన్నో స్మృతులు, జ్ఞాపకాలను తన పాటల రూపంలో వదిలి వెళ్లిపోయారు . అందుకే ఈ రోజు జనం ఆయన బౌతికంగా మన మధ్య లేరన్న విషయాన్నీ తమకు తోచిన విధంగా తెలుపుతూ ‘గాన గంధర్వుడికి’ నివాళులు అర్పిస్తున్నారు…
బాలు గారు అంటే ఏంటో ? బాలు గారు ఎలాంటి వారో ? బాలు గారి పాటలు కేవలం పాటలు మాత్రమే కాదు అవి కొన్ని జ్ఞాపకాలు అంటూ ఆయన అభిమానులు ఇంటర్నెట్లో షేర్ చేస్తున్న ఈ పోస్టులు ఒక మచ్చు తునక