కైలాస గౌరీ నోము చేయడం వల్ల కలిగే ఫలితాలు

ఆడవారికి ఆభరణాలు, ఆస్తిపాస్తుల కంటే భర్త ప్రేమానురాగాలే ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. భర్త తన పట్ల ప్రేమగా ఉంటూ తన పక్కన ఉంటే ప్రపంచాన్నే మరిచి పోతారు. అయితే ఆ అదృష్టం అందరికి ఉండదు. కానీ కైలాస గౌరీ నోము చేయడం వల్ల భర్త ప్రేమను సంపూర్నంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

Consequences of doing Kailash Gauri Nomuఒకానొక సమయంలో ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి గారాభంగా పెంచి పెద్ద దానిని చేశాడు. యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగున్ని వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.

Consequences of doing Kailash Gauri Nomuరాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది. ఆమె భర్త వేశ్యాలోలుడు. భార్యను సరిగా చూసేవాడు కాదు. భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది. మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు. తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసిందిగా పరమేశ్వరున్ని ప్రార్ధించేవాడు. ఆమె సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.

Consequences of doing Kailash Gauri Nomuఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది. నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావు అని చెప్పింది.

Consequences of doing Kailash Gauri Nomuఆ ప్రకారం రాజు కూతురు కైలాస గౌరీ నోము నోచింది. అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వేశ్యల పట్ల మమతానురాగాలు తొలగిపోయాయి. ఉంపుడు గత్తెల కపట ప్రేమ పట్ల అసహ్యం కలిగింది. భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది. ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది. వారిని చుసిన వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.

Consequences of doing Kailash Gauri Nomuఉద్యాపన: పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరంలో గాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పాలతో పంచిపెట్టి వారి ఆశీస్సులు పొందాలి. ఇలా చేస్తే నోము పూర్తవుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR