This Pure Convo Between A Mother & Her Son During This Lockdown Is A Must Read

అమ్మ: అరేయ్ తొందరగా లేచి…పాలు తీస్కొని రా !

కొడుకు: నేను పొనమ్మ…నిద్రొస్తుంది..!

అమ్మ: పోరా అస్సలే ఈ లొక్డౌన్ వాళ్ళ పాలు అయిపోతే దొరకడం లేదు.

కొడుకు: అమ్మ ఏందీ అమ్మ ఇది…రోజు నాకే చెప్పక పోతే…అక్కకి, తమ్ముడికి చూపొచ్చు కదా ?

అమ్మ: వాళ్ళని లేపితే రోజు వాడే వెళ్తాడు కదా…కొత్తగా మేము ఏంటి ? అంటున్నారు ?

కొడుకు: ఎహ్ పో అమ్మ అస్సలే షాప్ దగ్గర…సోషల్ డిస్టెన్స్ ఎహ్ ఫాలో అవ్వడం లేదు !

మీ బోడి టీ కోసం..నన్ను కరోనా తెచ్చుకోమంటావా ?

అమ్మ: అరేయ్ మన కాలనీలో ఇంకా ఎవ్వరికి…రాలేదు లేరా !

కొడుకు: రాగానే కనపడడానికి అది మొహం మీద వచ్చే మొటిమ కాదు…కరోనా అమ్మ రెండు వారలు టైం పడుతుంది !

అమ్మ: లేచే సరికి టీ లేకపోతే మీ నాన్న తిడతారు…!

కొడుకు: అన్న తిడుతాడనో…కొడతాడనో..పోతే అక్కడ నేను నాతో పాటు మీ…వద్దులే ఇటు ఇవ్వు !

అమ్మ: ఇంత సేపు వాదించక పోతే…ఈ టైం లో వెళ్ళి వస్తుండే కూడా…అక్కడ మాస్క్ ఉంది పెట్టుకుని తొందరగా వెళ్ళి !

కొద్దీ సేపటికి:

అమ్మ: వచ్చావా…అక్కడ శానిటైజర్ ఉంది హాండ్స్ వాష్ చేసుకొని లోపలి రా !

కొడుకు: ఆ వీటికి ఎం తక్కువ లేదు !

టీ తాగుతూ …..

అమ్మ: అరేయ్ ఈ లొక్డౌన్ ఎప్పుడు అయిపోతుంది ?

కొడుకు: ఇప్పుడు అప్పుడే అవ్వదులే…ఎందుకు ఇప్పుడు నీకు ఎం కష్టం వచ్చింది…అక్క, నేను, తమ్ముడు ఇంట్లోనే నుండి పని చేస్తున్నాం…సాలరీ వస్తుంది…తినడానికి సరిపడా సరుకులు డబ్బులు ఉన్నాయి కదా ?

అమ్మ: అన్ని ఉన్నాయి రా కానీ…?

కొడుకు: కానీ…చెప్పు అది కూడా !

అమ్మ: కార్తీక దీపం, కోకిలమ్మ, ఆమె కథ సీరియల్స్ రావడం లేదు…అయిపోతే మళ్ళీ చూడొచ్చు అని !

కొడుకు: అమ్మ అక్కడ జనాలు చనిపోతుంటే…నీకు సీరియల్, కావాల్సి వచ్చిందా ?

అమ్మ: అలా కాదు రా…జనాలు బయటకి వెళ్లారు కదా ? ఇంట్లోనే ఉంటారు కరోనా కూడా స్ప్రెడ్ అవ్వదు !

1 Ammaకొడుకు: కరెక్టే కానీ…ఆ సీరియల్స్ రావాలి అంటే షూటింగ్ చేయాలి…ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అలా చేస్తే అలా మీ వంటలక్కిని జైల్లో పెడతారు !

అమ్మ: అవునా అయితే వద్దులే…అలా ఐతే మా సీరియల్ ఇంకా లేట్ అవుతుంది !

కొడుకు: సరే నేను ఇక పని చేసుకోవాలి…ఏమైనా పని ఉందా నాతో !

అమ్మ: కొంచెం ఆ ఫ్రిడ్జ్ లో బాటిల్ అన్ని ఫిల్ చేసి పెట్టు…!

కొడుకు: అమ్మ…ఇందాక పాలు, ఇప్పుడు ఇది…నాకు పని ఉంది నేను చేయను !

అమ్మ: ఆ లాప్-టాప్ లో చూడడం, అదే కదా నీ పని…కరెక్ట్ ఎంత సేపు చేస్తావ్ మా అంటే ఒక రెండు గంటలు అంతే కదా !

కొడుకు: నీకు అలాగే ఉంటది…వర్క్ WFH తెలుస్తుంది బాధ !

2 Kodukuఅమ్మ: నేను…మీ నాన్నని పెళ్లి చేసుకునపతి నుంచి అదే చేస్తున్న…WFH అది కూడా with out సాలరీ !

కొడుకు: అమ్మ…అదిరిపోయే ఆన్సర్ ఇచ్చావ్ ఇందుకు కోసమైనా…బాటిల్స్ ఫిల్ చేసి పని చేసుకుంటా !

అమ్మ: సరే కానీ….మనది స్మార్ట్ టీవీ ఎహ్ కదా !

కొడుకు: అవును ఇప్పుడు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చ్చింది !

అమ్మ: ఎం లేదు రా…hotstar లో అయిపోయిన సీరియల్ ఎపిసోడ్స్ మళ్ళీ పెట్టేసి వేళ్ళు చూస్తూ కూర్చుంటా !

కొడుకు: అమ్మ ఈ సీరియల్ గోల ఏంటే…బాటిల్స్ నింపుదాం అనుకున్న నేను నింపాను ! ఆ సీరియల్ ఆపేసి పని చేసుకో !

అమ్మ: ప్లీజ్ రా…మళ్ళీ మీ డాడీ రిమోట్ పట్టుకుంటే ప్రతి న్యూస్ ఛానల్ పెట్టి చుసిన న్యూస్ పది సార్లు పెడతాడు…ఆ న్యూస్ లో కరోనా…కరోనా అని విని…విని…రాత్రిళ్ళు అది కాళ్ళోకి కూడా వస్తుంది !

కొడుకు: నేను అస్సలు పెట్టాను !

అమ్మ: సరే నేను పక్క ఇంట్లో సావిత్రి ఆంటీ వాళ్ళ ఇంట్లో చేస్తాలే !

కొడుకు: అమ్మ నీకు పిచ్చ…అలా వెళ్లొద్దు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటె…? నీకు వస్తుంది !

అమ్మ: ఎవరికీ లేదు లేదా…foreign కి వెళ్ళి రిటర్న్ అవ్వలేదు !

కొడుకు: foreign అనే కాదు అమ్మ అది..అది లోకల్ వాళ్ళకి అవుతుంది…అందుకే ఆ సీరియల్స్ ఆపేసి కొంచెం న్యూస్ చూదంటే వినవు !

అమ్మ: అవునా…సరే న్యూస్ పెట్టి నువ్వు పని చేసుకో పో …!

కొద్దీ సేపటికి…..(పని చేసుకుంటున్న కొడుకు రూంలోకి వచ్చి )

అమ్మ: ఒరేయ్…ఇప్పుడే పక్కన ఇంటి చెప్పారు మన కాలనీ లాస్ట్ ఇంట్లో ఉంటున్న రావు వాళ్ళ అబ్బాయికి…పాజిటివ్ అంట !

3 Ammaకొడుకు: అమ్మ అలా వాళ్ళు విల్లు చెప్పేది నమ్మకు…ఫేక్ న్యూస్ ఉంటాయి !

అమ్మ: మరి అందరు అంటున్నారు నిజం కాదా ?

కొడుకు: వాడిని టెస్ట్ చేస్తే చేస్తే నెగటివ్…వచ్చింది నేను ఇంతక ముందే మాట్లాడ..నువ్వు అనవసరంగా భయపడకు !

అమ్మ: అవునా నెగటివ్ వచ్చిందా హమ్మయ్య…! సరే కానీ నువ్వు రేపటి నుండి పాలకని, పెరుగుకాని, షాప్ కి పోవొద్దు..ఇంట్లోనే ఉండు…!

కొడుకు: చూసావా ఏదైనా మన ఢాకా వచ్చే వరకు చూడొద్దు…వచ్చాక కంగారుపడొద్దు, అందుకే టీవీల్లో, న్యూస్ లో చెప్తున్నారు ఇంట్లోనే ఉండాలని…ఎయిడ్ ఒక్కటే మార్గం అని !

అమ్మ: మరి అవసరాలు ఉంటె ?

కొడుకు: వెళ్ళాలి కానీ…కొన్ని జాగ్రత్తలు…పాటించాలి !

#StayHomeStaySafe

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR