బరువు తగ్గాలనుకునేవారిని కూల్ డ్రింక్స్ ఎందుకు మానేయమంటారో తెలుసా?

ఎండలో బయటకు వెళ్లి వస్తే ఓ కూల్ డ్రింక్ తాగి సేదతీరే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఒకప్పుడు ఇంటికి అతిథులు వస్తే మట్టి కుండలోంచి చల్లటి నీళ్లు ఇచ్చి, ఆ తరువాత మజ్జిగో, నిమ్మరసమో కలిపి ఇచ్చే వాళ్లు. కాని ప్రస్తుతం కూల్​డ్రింక్స్​​ తప్పనిసరి అయ్యాయి. యువత పార్టీ ఏదైనా బిర్యానీతో పాటు కూల్​డ్రింక్​ ఉండాల్సిందేనంటారు. నలుగురు స్నేహితులు ఒకచోట కలిస్తే కబుర్లలో కూల్​డ్రింక్​ భాగమైపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కూల్​డ్రింక్​​ రోజువారీ జీవితంలో భాగమైంది. రోజుకు లీటర్​పైనే తాగేవాళ్లు కూడా ఉన్నారు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తాగుతున్నారు. కానీ ఈ కూల్​డ్రింక్స్​​ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

cool drinksఈ కూల్ డ్రింక్స్ తాగడం అంటే మనకు మనమే పంచదార తినడం లాంటిది. ఎందుకంటే ఒక 350 మిల్లీలీటర్ల డ్రింక్ బాటిల్ లో దాదాపుగా 35 నుంచి 45 గ్రాముల షుగర్ ఉంటుంది. అందుకే మనము కూల్ డ్రింక్ తాగిన వెంటనే ఐదు నుంచి పది నిమిషాల్లో మన శరీరంలో దాదాపుగా 10 చంచాల షుగర్ వెళుతుంది. దీని వల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా ఎక్కువగా పెరిగి పోతాయి. ఎంత పెరుగుతాయి అంటే మొత్తానికి సరిపోయే గ్లూకోజ్ ఒక్కసారిగా తయారవుతుంది. సాధారణంగా మనము ఇంత షుగర్ తినలేము చాలామందికి కొద్దిగా షుగర్ తినగానే కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇంత శాతం షుగర్ శరీరంలోకి ఒక్కసారి వెళ్లగానే దీనివల్ల మనకు వికారం మరియు వాంతులు వచ్చేలా అనిపిస్తుంది.

cool drinksకానీ కూల్ డ్రింక్ లో ఎంత శాతం షుగర్ ఉన్న కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఎప్పుడూ మనకు అలా అనిపించదు. ఎందుకంటే కూల్ డ్రింక్ లోపల ఎక్కువ మోతాదులో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కూల్డ్రింక్స్ లోపల ఉండే షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కూల్ డ్రింక్ తాగిన 20నిమిషాల తర్వాత మన శరీరంలో షుగర్ శాతం ఎక్కువగా పెరిగిపోతుంది. దీనిని తగ్గించడానికిమన శరీరంలో ఇన్సులిన్ శాతం బాగా పెరిగిపోతుంది. ఒక్కసారిగా ఇలా జరగటం వలన మన లివర్ దీనిని సక్రమంగా హ్యాండ్ చేయలేదు దీని వల్ల మన శరీరంలో షుగర్ శాతం బాగా పెరిగిపోయి షుగర్ అరిగిపోకుండా కొవ్వులా తయారయ్యి మన పొట్ట దగ్గర పేరుకుపోతుంది.

fatకూల్‌డ్రింక్స్‌ తోపాటు అనేక ఇతర ఆహార పదార్థాల్లో వాడే హై ఫ్రక్టోస్‌ కార్న్‌ సిరప్‌ అనే పదార్ధాన్ని ఎక్కువగా వాడడం వలన అది శరీరంలో కొవ్వు నిల్వలను అధికం చేస్తుంది. ఆ సిరప్ వలన చాలా రకాల అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. హెచ్‌ఎఫ్‌సీఎస్‌ లు చిన్నపేగుల్లోని కణాల్లో కొన్ని మార్పులకు కారణం అవుతాయని, తద్వారా పోషకాలు ఎక్కువ మొత్తంలో శరీరానికి చేరడం వలన బరువు పెరుగుతారని చెబుతున్నారు. కూల్ డ్రింక్స్ తాగడం వలన మన శరీర కణాల్లో ఫ్రక్టోస్‌-1-ఫాస్పేట్‌ ఎక్కువగా నిల్వ ఉండడం వలన బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది.

high fructose corn syrupకూల్ డ్రింక్స్ లోపల సిగరెట్ టీ కాఫీ లో ఉండే కెఫిన్ ఉంటుంది. దీనివల్ల కూల్ డ్రింక్స్ తాగిన 40 నిమిషాల తర్వాత మన శరీరం దీన్ని పూర్తి శాతం అబ్జర్వ్ చేసుకుంటుంది. కెఫిన్ వల్ల కళ్ళలో ఉండే కనుగుడ్లు బాగా యాక్టివేట్ అవుతాయి టీ మరియు కాఫీ లాగా. ఇవి తాగడం వలన మనకు తొందరగా నిద్ర పట్టదు బద్ధకం పోయినట్టు అనిపిస్తుంది ముందు కంటే ఎక్కువగా ఆక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధంగా మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది దీన్ని కంట్రోల్ చేయడానికి లివర్ మన శరీరంలో ఇంకా కొంచెం షుగర్ రిలీజ్ చేస్తుంది.

caffeineకూల్ డ్రింక్ తాగిన 50 నిమిషాల తర్వాత శరీరంలో మన మెదడుని ఆనందపరిచే కెమికల్ అంటే డోపమైన్ శాతం బాగా పెరుగుతుంది. ఈ కెమిక‌ల్‌ వల్ల రక్తపోటు పెరుగుతుంది.మ‌రియు గుండె ప‌నితీరు మంద‌గించి, హార్ట్ ఎటాక్ లేదా ఇత‌ర స‌మ‌స్య‌లను తెచ్చి పెడుతుంది. అంతేకాదు దీనివల్ల మనకు హాయిగా ఒక రకమైన ఆనందం సంతోషం వస్తుంది. ఇది అచ్చంగా సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే నాషలా ఉంటుంది. దీనివల్ల మన మెదడు మనల్ని మళ్లీమళ్లీ కూల్డ్రింక్ తాగాలి అనిపించేలా చేస్తుంది. అలాగే కొద్దికొద్దిగా మన అవసరంగా మారిపోతుంది.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలు అంటే ఒక గంట తర్వాత ఇందులో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ప్రభావం చూపడం మొదలు పెడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్యాల్షియం మెగ్నీషియం మరియు జింక్ లాంటి అవసరమైన పోషక విలువలు ఇది మన చిన్నపేగుల లోకి తీసుకు వస్తుంది. దీనివల్ల కూల్ డ్రింక్ తాగితే గంట తర్వాత టాయిలెట్కు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల కూల్ డ్రింక్ తాగకు ముందు శరీరంలో ఎంత శాతం నీళ్లు ఉంటాయో మొత్తం కూల్ డ్రింక్ తాగిన గంట తర్వాత శరీరం నుండి పూర్తిగా బయటకు వెళ్లిపోతాయి.

phosphoric acidకూలింగ్ లోపల కెఫిన్ మరియు ఫాస్పారిక్ యాసిడ్ శాతం ఎక్కువ బదులు ఉండడం వలన మన శరీరంలో క్యాల్షియం మెగ్నీషియం మరియు జింక్ లాంటి మినరల్స్ తొందరగా తగ్గిపోతాయి. దీనివల్ల మన ఎముకలు తొందరగా బలహీనపడి పోతాయి. శరీరంలో ఒక్కసారిగా ఇంత ఎక్కువ మోతాదులో పోషక విలువలు తగ్గిపోవడం వలన ఒక గంట తర్వాత పూర్తిగా అలసి పోయినట్టు అనిపిస్తుంది. శరీరంలో ఉండే నీటి శాతం పూర్తిగా తగ్గి పోవడం వలన శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.

కూల్​డ్రింక్స్​లో ఉండే యాసిడ్స్, చక్కెర దంతాలకు హాని చేస్తాయి. వీటివల్ల దంతాలపై ఉండే ఎనామిల్​ పొర కరిగిపోతుంది. దంత క్షయం ఏర్పడుతుంది. దంతాల మీద బ్యాక్టీరియా చేరి దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ళ వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి. దంతాలు సెన్సిటివ్​గా మారి చల్లని, వేడి పదార్థాలు కూడా తీసుకోలేకపోతారు. ఇక ప్రెగ్నెంట్‌గా ఉన్న మ‌హిళ‌లు కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల‌ మిస్ క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదేవిధంగా, కూల్ డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ స‌మ‌స్య‌లు రెట్టింపు అవుతాయి. మ‌రియు జీర్ణ శ‌క్తి త‌గ్గిపోతుంది. కాబ‌ట్టి, కూల్ డ్రింక్స్‌కు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR