Home Health ఈ సమస్య ఉన్నవారు సీతాఫలాలు తినకూడదట!

ఈ సమస్య ఉన్నవారు సీతాఫలాలు తినకూడదట!

0
custud apple
సీజనల్ పండ్లలో మామిడిపండ్ల తరువాత అంత రుచికరమైనవి సీతాఫలాలే. లేతఆకుపచ్చ రంగు తొక్కలతో తెల్లని గుజ్జుతో నల్లని గింజలతో ఉండే సీతాఫలాలను పిల్లలతోపాటు.. అందరూ ఇష్టపడతారు. సీతాఫలంలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, ఎ, బి, కె క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఈ పోషకాలన్నీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.
  • సీతాఫలంలో పుష్కలంగా ఉండే పోషకాలు విటమిన్లు శరీర కణజాల పునరుద్ధరణకు తోడ్పడతాయి. సీతాఫలంలో ఎక్కువగా ఉండే కాపర్, పీచుపదార్థాలు మలబద్ధకం సమస్యను తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. సీతాఫలంలో ఎసిటోజెనిన్,  కెటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ లు ఆల్కలాయిడ్ లు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అరటిపండులో కన్నా సీతాఫలంలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది.
  • ఇది గుండె ఆరోగ్యానికి, బిపి తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులోని మెగ్నీషియం మూలాలను తొలగించి కండరాల సాగులోకి తోడ్పడతాయి. దాంతో మనకు కీళ్లనొప్పుల నుంచి విముక్తి కలిగిస్తాయి. సీతాఫలాన్ని తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవచ్చు. మనలో ఉన్న డిప్రెషన్ ను తగ్గిస్తుంది.
  • ఇది కంటి చూపును, జుట్టుని, మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి, హిమోగ్లోబిన్ మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. సీతాఫలంలోని బయోయాక్టివ్ అణువులు, యాంటీ ఒబెసియోజెనిక్, యాంటీ డయాబెటిస్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో-గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు.
  • అయితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. సీతాఫలం శరీరానికి అనేక విధాలుగా హాని చేస్తుందని చాలా మందికి తెలియదు. ఇది శరీరానికి మంచిదని భావించినప్పటికీ.. ఇది అనేక సమస్యలను తెస్తుందంటున్నారు నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో ఒక సీతాఫలం మాత్రమే తినాలి. ఎక్కవగా తింటే పలు అనర్ధాలు తప్పవంటున్నారు నిపుణులు.
  • సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని డైట్.  కాకపొతే, సీతాఫలంలో కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కేలరీలు సహజంగా బరువు పెరగడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో క్యాలరీల పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా బరువు పెరిగే సమస్య మొదలవుతుందంటున్నారు నిపుణులు. అధిక క్యాలరీలు కలిగిన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే బరువు తగ్గడేమో కానీ మళ్లీ అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదు.
  • సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు సీతాఫలాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు వికారం సమస్యను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే సీతాఫలాన్ని రోజుకు ఒకసారి మాత్రమే అది కూడా ఒక్కటి మాత్రమే తినాలి.
  • సీతాఫలం ఆరోగ్యానికి మంచిదని.. దీనిని తినాలని సలహా ఇస్తారు. కానీ దీనిని తినడం వల్ల చాలా మందికి అలెర్జీలు లేదా దురద, చర్మ సమస్యలు తలెత్తవచ్చు. మీరు సీతాఫలాన్ని తిన్న తర్వాత మీకు అలెర్జీ లేదా దురద వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే తినడం మానేయాలి. ఇది మాత్రమే కాదు.. ఇప్పటికే అలెర్జీ సమస్య ఉన్నవారు సీతాఫలానికి దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.
  • సీతాఫలం వల్ల చాలా మందికి కడుపు సమస్యలు వస్తుంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని అస్సలు తినకూడదు. సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. సీతాఫలాన్ని అధికంగా తింటే మీరు కడుపు నొప్పి, పేగుల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Exit mobile version