Home Unknown facts చీకటి పడ్డాక పూలు తెంపకూడదు… ఎందుకో తెలుసా?

చీకటి పడ్డాక పూలు తెంపకూడదు… ఎందుకో తెలుసా?

0
ఏ దేవుని పూజకు అయినా కావలసినవి పూలు. ప్రకృతి అందాన్ని మరింత రెట్టింపు చేసేవి పూలు. హిందూ సాంప్రదాయంలో పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పూజ చేసేటప్పుడు ముఖ్యంగా కావలసినవి పువ్వులు. ఆడవారి జడ అందంగా కనపడాలన్నా పూలు పెట్టాల్సిందే.
  • అయితే మన పెద్దవాళ్ళు సాయంత్రం సమయంలో పువ్వులను కోయవద్దని చెబుతారు.  సాయంత్రం సమయంలో పువ్వులను కోయటం వల్ల  ఏమైనా కీడు జరుగుతుందా? మన పెద్దలు ప్రకృతి పరంగా మరియు శాస్త్రీయమైన విషయాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఆచారాలను ఏర్పాటు చేసారు.
  • వాటి వెనుక కారణాలు తెలుసుకోకుండా గుడ్డిగా పాటిస్తే కొంతకాలానికి అవి మూఢనమ్మకాలుగా మారతాయి. నిజానికి సాయంకాలం పూవులను కోయరాదు అని చెప్పడంలో ప్రకృతి పరమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం…
  • సాయంత్రం సమయంలో కొన్ని పనులను నిషేధించారు మన పెద్దలు. అందులో ఎక్కువగా మనకు వినపడేది చీకటి పడిన తరువాత చెట్ల మీద చేయి వేయకూడదు అని. అంటే పూలు కూడా కోయకూడదు అని అర్ధం.
  • సాయంత్రం వెలుతురు తగ్గే సమయం మరియు చల్లగా ఉండటం వల్ల పురుగులు, పాములు వంటి విష జంతువులు చెట్ల మీద సేద తీరుతాయి. మనం ఆ సమయంలో చెట్ల వద్దకు వెళ్లి పూలను కొస్తే ఆ విష జంతువుల బారిన పడతామని పూవులను సాయంత్రం కోయవద్దని పెద్దవారు చెప్పుతారు.

Exit mobile version