Home Health ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?

ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి?

0
ఫోలిక్ యాసిడ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా..? లేదా అయితే విటమిన్ బి9 అని వినే ఉంటారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన విట‌మిన్ల‌లో ఇది కూడా ఒక‌టి. దీన్నే ఫోలేట్ అని కూడా అంటారు. దీంతో అనేక జీవ‌క్రియ‌లు నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. కొత్త క‌ణాలు త‌యార‌వుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఫోలిక్ యాసిడ్ నీటిలో క‌రుగుతుంది. అందువ‌ల్ల శ‌రీరానికి ఇది సుల‌భంగానే ల‌భిస్తుంది. కాక‌పోతే ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.
  • ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఫోలిక్ యాసిడ్ లోపం ఉంటే అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఫోలిక్ యాసిడ్ లోపం వ‌ల్ల ఎల్లప్పుడూ అసౌక‌ర్యంగా, ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. శ్వాస తీసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఎల్ల‌ప్పుడూ కోపంగా ఉంటారు. నీర‌సించి పోయిన‌ట్లు అనిపిస్తుంది. నీర‌సంగా ఉంటుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తుంది. ఒక్కోసారి శ్వాస తీసుకోవ‌డం కూడా క‌ష్టం అవుతుంది.
  • త‌ర‌చూ త‌ల‌నొప్పి ఇబ్బంది పెడుతుంది. ఏకాగ్ర‌త్త క్ర‌మంగా క్షీణిస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వాలన్నా, వారి కాన్పు సజావుగా జరగాలన్నా ఫోలిక్ యాసిడ్‌ సమృద్ధిగా ఉండడం తప్పనిసరి. లేకుంటే పుట్టబోయే పిల్లల్లో అనేక‌ లోపాలు తలెత్తుతాయి.  ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల బిడ్డ శారీర‌క‌, మాన‌సిక ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది.  పుట్టబోయే పిల్లల్లో మెద‌డు, వెన్నెముక స‌మ‌స్యలు రాకుండా ఉండాలంటే గ‌ర్భిణులు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. అందుకే డాక్టర్లు కూడా గ‌ర్భిణుల‌కు ఫోలిక్ యాసిడ్ మందుల‌ను రాస్తుంటారు.
  • గ‌ర్భిణీలు రోజుకు 400 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి. గ‌ర్భం దాల్చిన తొలి 12 వారాల వ‌ర‌కు మ‌హిళ‌లు రోజుకు 500 మైక్రో గ్రాముల వ‌ర‌కు ఫోలిక్ యాసిడ్‌ను తీసుకోవాలి. పాలిచ్చే త‌ల్లుల‌కు రోజుకు 300 మైక్రో గ్రాముల వ‌రకు ఫోలిక్ యాసిడ్ స‌రిపోతుంది. అయితే గ‌ర్భంతో ఉన్న‌వారు కాక మిగిలిన వారు ఫోలిక్ యాసిడ్‌ను మాత్ర‌ల రూపంలో కాక‌, అది ల‌భించే ఆహారాల‌ను తీసుకోవ‌డం మంచిది.
  • అలాగే క్యాన్సర్‌ రాకుండా, డీఎన్ఏ మార్పులు జ‌ర‌గ‌కుండా చూసేందుకు కూడా ఫోలిక్ యాసిడ్ అవ‌స‌రం అవుతుంది. ఇక శ‌రీరంలో ఫోలిక్ యాసిడ్ లోపిస్తే…ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గ‌డం, ఆక‌లి లేక‌పోవ‌డం, త‌ర‌చూ మ‌గ‌త‌గా ఉండ‌టం, కంటి నరాల్లో క్షీణత ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.క‌నుక ఎవ‌రైనా స‌రే ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. దీంతో ఫోలిక్ యాసిడ్ లోపానికి దూరంగా ఉండోచ్చు.
  • వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి స‌హ‌జంగానే మ‌తిమ‌రుపు వ‌స్తుంటుంది. కంటి చూపు త‌గ్గుతుంది. కానీ ఫోలేట్ ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బయ‌ట ప‌డ‌వ‌చ్చు. వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రావు. ఆస్టియో పోరోసిస్, నిద్ర‌లేమి, గుండె జ‌బ్బులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల‌కు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా అవ‌స‌రం ఉంటుంది. అందుక‌ని 11 ఏళ్లు దాటిన‌ప్ప‌టి నుంచి అమ్మాయిలు ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.
  • కాగా, బ్రొకొలి, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, అవిసె గింజ‌లు, మొలక‌లు, రాజ్మా, బీట్ రూట్‌, అవ‌కాడో, చిల‌గ‌డ దుంప‌లు, నారింజ పండ్లు, గుడ్లు, బాదంప‌ప్పు, కందిప‌ప్పు, క్యారెట్లు వంటి ఆహారాల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఆయా ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. పాలకూర, తోటకూర, పుదీనా, నట్స్, మాంసం, గుడ్లు, పాలు, బీన్స్‌, చిక్కుడు జాతి గింజలు, నిమ్మజాతి పండ్లు వంటి వాటిలో కూడా ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉంటుంది. కాబ‌ట్టి, వీటిని త‌ర‌చూ తీసుకుంటే మంచిది.‌

Exit mobile version