ముగ్గు వేయడం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే.. ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒక్కటీ మూఢనమ్మకం కాదు. ప్రతి ఆచారం వెనక అంతరార్థం ఉంది.
- సాధారణంగా ప్రతి ఇంటిలో మహిళలు ఉదయం లేవగానే ఇంటి ముందు ఉన్న చెత్తను ఊడిచేసి నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గులు వేయటం జరుగుతూనే ఉంటుంది. దాంతో ఇంటి ముందు ప్రాంతం అంతా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
- అయితే పండితులు అమావాస్య రోజున ముగ్గులు వేయకూడదని చెప్పుతున్నారు. అమావాస్య ముందు రోజున ఇంటికి పితృ దేవతలు వస్తారు. అందువల్ల ఆ సమయంలో పితృదేవతలకు అర్ఘ్యమిస్తే వంశాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్పుతున్నారు.
- ఆరోజు ఇంటిముందు వున్న చెత్తను శుభ్రం చేసుకుని, నీటిని చల్లుకోవచ్చు కానీ ముగ్గులు ఎట్టి పరిస్థితిలో వేయకూడదని చెప్పుతున్నారు పండితులు. ఒకవేళ ముగ్గులు వేస్తె పితృ దేవతలు రాకుండా ఇంటి బయట వాకిలిలోనే ఆగిపోతారు.
- అందువల్ల అమావాస్య రోజున పితృ దేవతలను మనసారా ప్రార్ధించాలని పండితులు అంటున్నారు. పితృ దేవతలకు అమావాస్య చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు పితృ దేవతలను కొలిస్తే సకల సంపదలు కలుగుతాయని పండితులు అంటున్నారు.