కొన్ని మాటలకు అర్ధాలు ఉండవు భావాలు తప్ప. అలాంటి భావాలెన్నో పలికించారు సాయిమాధవ్ బుర్రా. “మహానటి” చిత్రంలో కీర్తి సురేష్ నటన, నాగఅశ్విన్ దర్శకత్వం, డాని సినిమాటోగ్రఫీ తర్వాత సినిమాకి ప్రాణం పోసింది సాయిమాధవ్ గారి మాటలే. కొన్ని మాటల్లో ఎంత లోతైన అర్ధం ఉందంటే.. వాటిని ఆచరించడానికి మన జీవితకాలం సరిపోదు. “మహానటి” అలాంటి సంభాషణలు కోకొల్లలుగా ఉన్నప్పటికీ.. అమితంగా ఆకట్టుకొన్న ఓ 20 సంభాషణలు మీకోసం..!!
1) నాకు సావిత్రి తెలియదు.. సావిత్రిగారు మాత్రమే తెలుసు
2) పెద్దవాళ్లని గౌరవించాలి, సావిత్రిగారి లాంటి వాళ్ళని పెద్దవాళ్ళు కూడా గౌరవించాలి
3) వ్యక్తిత్వం గురించి రాయాలంటే అర్హత కావాలి
4) కథ ప్రేమలాంటిది, మనకి కావాల్సినప్పుడు దొరకదు, దానికి కావాల్సినప్పుడే వెతుక్కుంటూ వస్తుంది.
5) మాటలకు భాష కావాలి, మనసుకి కాదు.
6) జీవితంలో నటించొచ్చు కానీ, జీవితాన్ని నటించకూడదు.
7) ప్రతిభ ఇంటిపట్టునుంటే.. ప్రపంచానికి పుట్టగతులుండవు
8) నీకు సినిమాలు అవసరమైనప్పుడు సినిమా నీ అవసరాన్ని తీర్చిందిగా.. ఇప్పుడు సినిమాకి నువ్వు అవసరం.
9) నువ్వు నా వెనకుండి ఆటపట్టిస్తున్నావునున్నాను.. కానీ ముందుండి మాయాబజార్ నే నడిపిస్తున్నావ్.
10) ఆడాళ్ళ ఏడుపు అందరికీ తెలుస్తుంది, మగాళ్ల ఏడుపు మందు బాటిల్ కు మాత్రమే తెలుస్తుంది.
11) శరీరంలో మార్పు వచ్చిందంటే.. జీవితంలో కూడా ఏదో మార్పు వస్తుందని అర్ధం.
12) నేను మరీ అంత మహానటిని కాదులెండి.. కెమెరా లేకపోతే బొత్తిగా నటించడం రాదు.
13) అందరూ దాన్ని అలవాటు, వ్యసనం అనుకుంటారు.. కానీ అదొక జబ్బు.
14) ఇది కలికాలం.. వడ్డించిన చేతికున్న ఉంగరాళ్ళు లాక్కెళ్లే రకాలమ్మా ఇప్పుడున్న వాళ్ళు.
15) ఆవిడ కథలో కన్నీళ్ళునాయి.. కానీ వాటిని తుడుచుకుని లేచే ధైర్యం కూడా ఉంది.
16) ప్రేమించినవాడి కోసం అందర్నీ వాదులుకున్నాను. ప్రేమ కోసం ప్రేమించినవాడ్ని కూడా వదులుకున్నాను.
17) ఎప్పుడు చనిపోతామో తెలియని జీవితంలో ఒక్క క్షణం ప్రేమ దొరకడమే అదృష్టం.
18) ప్రేమ అందరికీ దొరకదు, దొరికితే పోరాడాలి.
19) జీవితం చాలా చిన్నది, ఈ కాసేపు మనం మనలాగే ఉండాలి.
20) చివారికు మిగిలేదేమిటి.. మనం పంచిన ప్రేమ, మనం చేసుకున్న జ్ణాపకాలు.