శివుడి అనుగ్రహం కోసం రావణుడు తన తలని నైవేద్యంగా పెట్టాడా ?

0
241

రాముడు మనకు ఎంతగా తెలుసో రావణుడూ అంతగానే తెలుసు. పది తలలతో చూడగానే రావణుడని ఇట్టే పోల్చేస్తాం. అతని రాక్షస గుణమే కాదు, అతని మహా భక్తికూడా మనల్ని ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది.

Ravanaవిశ్వవో బ్రహ్మకు సుమాలి కూతురు కైకసికి పుట్టిన తొలి కుమారుడు రావణుడు. తన పరాక్రమంతో ముల్లోకాలను జయించిన వీరుడిగా రావణాసురుడిని చరిత్ర అభివర్ణిస్తోంది. రావణుడిని అందరూ దశకంఠుడుగా పిలుస్తారు.

Ravanaపది తలలూ ఉన్నట్టే అందరూ చిత్రీకరిస్తారు. కానీ దశకంఠుడి తలల గురించి మరో కథ ప్రచారంలో ఉంది. దాని ఉన్న ప్రకారం వివాహానంతరం రావణుడు కేవలం తొమ్మది తలలతో మాత్రమే మిగిలాడు. అదెలాగంటే.

Ravanaఅపారమైన బలాన్ని పొందడం కోసం శివుడిని ఆరాధించినప్పుడు రావణుడు ఒక దశలో శివుడు తనను అనుగ్రహించడం లేదనే ఆగ్రహంతో ఒక తలను తెగనరుక్కుని శివుడిని నివేదిస్తాడు. తరువాత శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆ తలనూ యథావిధిగా తిరిగి పొందమని సూచిస్తాడు.

Ravanaకానీ అందుకు రావణుడు నిరాకరిస్తాడు. నీకు పెట్టిన నైవేద్యం తను తిరిగి తీసుకోనని రావణుడు దాన్ని తిరస్కరిస్తాడు. ఆ ప్రకారం అప్పటి నుండి రావణుడికి తొమ్మిది తలలే ఉన్నాయని ఉపకథ.

 

SHARE