చిగుళ్ల వ్యాధికి హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు సంబంధం ఉందని మీకు తెలుసా?

0
225

దంతాలు శుభ్రంగా లేకపోతే ఆరోగ్యం చెడిపోతుందని మీకు తెలుసా? చిగుళ్ల వ్యాధికి హార్ట్ ఎటాక్, డయాబెటిస్ లాంటి వ్యాధులకు సంబంధం ఉందని మీకు తెలుసా? దంతాలే కదా అని తక్కువ అంచనా వేస్తే.. పెద్ద నష్టానికి దారి తీయొచ్చు. చిగుళ్ల నుంచి కారే రక్తం ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుందని అది రక్తం నుంచి నేరుగా గుండె, మెదడకు చేరి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

Gum Diseasesచిగుళ్లకు ఇన్ఫెక్షన్స్ పెరిగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి మదుమేహం నియంత్రణ అదుపుతప్పుతుంది. ఈ స్థితి రాకుండా ఎప్పటికప్పుడు దంతాలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

gum diseaseరోజుకు రెండుసార్లు ఉదయం, రాత్రి.. పళ్లు తోముకోవాలి. రాత్రిపూట కూడా బ్రష్ చేసుకోవటం, నాలుకని శుభ్రపరుచుకోవడం మరిచిపోవద్దు. నాలుకను శుభ్రం చేయడం వల్ల దంత క్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించవచ్చు. వయసు పెరుగుతుంటే దంతాల మధ్య సందులు ఏర్పడతాయి. ఆ సందుల్లో ఆహార పదార్థాలు పేరుకుపోకుండా, పాచిపట్టకుండా ఉండేందుకు ఇంటర్ డెంటల్ బ్రష్‌లు వాడటం ఉత్తమం. ప్రతిరోజు పళ్లు తోముకున్న తర్వాత ఒకసారి వేళ్లతో చిగుళ్లను మర్దనా చేసుకోవాలి.

gum diseaseఆహార పదార్థాలు తిన్న వెంటనే నీటితో నోరు శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. పండ్లు, పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే దంతాలకు, చిగుళ్లకు మంచిది. పొగతాగటం, పాన్‌లు, గుట్కాలు, మద్యం తాగటం వంటి అలవాట్లకు దూరంగా ఉంటే దంత సమస్యలను తగ్గించుకోవచ్చు.

gum diseaseదాంతోపాటు పళ్లు తోముకోవడానికి సరైన టూత్ బ్రష్‌ను ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే. నోట్లోని అన్ని మూలలకు చేరేలా ఉండే ఫ్లెక్సిబుల్‌ బ్రష్‌ను మాత్రమే వాడాలి. టూత్ పేస్ట్‌ను కొద్దిగానే వాడాలి. పిల్లలకు కూడా కొద్దిగానే టూత్ పేస్ట్ ఇవ్వాలి. వారు పేస్ట్ మింగకుండా చూడాలి. చిన్నపిల్లల్లో పాలదంతాలు ఉంటాయి. కాబట్టి వారికి పెద్దలు ఉపయోగించే బ్రష్ వాడకూడదు.

gum diseaseఇక చల్లని, వేడి పదార్థాలు తినేటప్పుడు దంతాలు ఝుమ్మని లాగుతున్నట్లయితే యాంటీ సెన్సిటివిటీ టూత్ పేస్టులు వాడటం ఉత్తమం. దంతాల బయటివైపు, లోపల, నమిలే భాగాల్లో బాగా బ్రష్ చేయాలి. నోట్లో టూత్ బ్రష్ వెళ్లలేని ప్రాంతాలను శుభ్రం చేయడానికి మౌత్ వాష్ ఉపయోగించొచ్చు.

SHARE