కారం ఎక్కువుగా తినడం వలన కలిగే అనర్ధాలు

సాధారణంగా స్వీట్ కంటే కూడా స్పైసీ ఫుడ్స్ అంటేనే చాలామందికి మ‌క్కువ ఎక్కువ‌గా ఉంటుంది. అందుక‌నే ఏ ఆహారం తిన్నా అందులో కారం ఎక్కువ‌గా ఉండేలా చూసుకుంటారు. అయితే నిజానికి కారం మ‌న శ‌రీరానికి ఎంత మంచి చేస్తుందో, అంత న‌ష్టం కూడా క‌ల‌గ‌జేస్తుందట. అందుకే కారం అయినా స‌రే ప‌రిమితంగా తినాలి. మితంగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అతిగా తీసుకుంటే అన్ని నష్టాలు క‌లుగుతాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, తీపి, కారం, పులుపు అన్నీ మితంగా ఉంటే ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలా కాకుండా అధిక కారంతో తయారైన వంటకాలు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు కడుపుకు చేటు కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కారంకారమంటే  పచ్చిమిర్చి అని ఇక్కడ ఉదేశ్యం కాదు, కరంగా ఉండే ఏ పదార్థమైనా సరే మిరపకాయ లేదా ఎండు మిర్చి, లేదా ఎండు కారం ఏదయినా కారం చేసే చేటు గూర్చి ఆయుర్వేదం కొన్ని వాక్యాలు చెప్పింది ఒకసారి అవేంటో చూద్దాం. కారం  అధికంగా తీసుకుంటే శరీరం శుష్కిస్తుంది. అంటే  శరీరంలో జవసత్వాలు కోల్పోయి బలహీనంగా  తయారవుతుంది. చాలా మంది చెప్పుకునే చురుకుదనం, ఆరోగ్యం అనేవి ప్రస్తుత సమాజ పరిస్థితులకు వ్యతిరేకం. ఎలాంటి శారీరక శ్రమ లేని ఈ కాలంలో కారం ఆరోగ్యం పాలిట యమపాశం అనే చెప్పుకోవాలి.

కారంముఖ్యంగా కారం ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల చెమ‌ట ఎక్కువ‌గా వ‌స్తుంది. దీంతో ఇబ్బందులు వ‌స్తాయి. అలాగే అసిడిటీ, గ్యాస్ వ‌స్తాయి. కొన్ని సార్లు విరేచ‌నాలు అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. మిర్చిని కూరల్లో దంచిపారేసి.. లొట్టలేసుకుని తినడం ద్వారా ఒబిసిటీ తప్పదని పరిశోధకులు అంటున్నారు. కారంగా ఉన్న వంటకాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఉష్ణం అధికమవుతుందని, తద్వారా స్థూలకాయం తప్పట్లేదు. కారం తినేటప్పుడు నీరు అధికంగా సేవించడం చేస్తారు. అలాగే కారాన్ని ఎక్కువగా తీసుకుంటే అంతే ఎక్కువగా ఆకలి ఉంటుందని తద్వారా ఒబిసిటీకి దారితీస్తుంది. అలాగే నాలుక‌పై ఉండే రుచిక‌ళిక‌లు రుచిని ప‌సిగ‌ట్టే సామ‌ర్థ్యాన్ని కోల్పోతాయి.

కారం
తల తిరుగుడు, కళ్ళు బైర్లు కమ్మడం, చీకట్లుగా కనిపించడం, తూలి పడిపోవడం ఇలాంటి లక్షణాలు ఎక్కువ కారం తిన్నపుడు కలుగుతుంటాయి. గొంతులో మండిపోతున్నట్లు అవుతుంది, ఒంట్లో వేడి పెరిగిపోయి జ్వరిజం వచ్చినట్టు లోపలి శరీరం వేడి కక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఒంట్లో బలం కోల్పోయినట్టు అనిపించడం వలన  మనిషి నీరసంగా నిస్త్రాణంగా కనిపిస్తాడు.

కారంచ‌ర్మంపై కొంద‌రికి ద‌ద్దుర్లు కూడా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కారం ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల రక్త కణాలు డైల్యూట్‌ అయిపోయి చర్మాన్ని కాంతి విహీనంగా మారుస్తాయి. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల తొందరగా ముడతలు రావడానికి దోహదపడతాయి.

కారంకారం అతిగా తినేవాళ్ళు కారాన్ని కంట్రోల్ లొ పెట్టుకుంటే వాతం నొప్పులు తగ్గుతాయి అయితే కారాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటే  వతాహం వికారం చెంది అనేక వాత వ్యాధుల్ని ఉత్పత్తి చేస్తుంది.  శరీరంలో వణుకు, నెప్పులు, పోట్లు, కత్తితో కోసినట్టు, సుత్తితో కొట్టినట్టు అమితమైన బాధ, కాళ్ళూ, చేతులు మంటలు, పిక్కలు, వేళ్ళలో నొప్పులు వంటివి కారాన్ని అధికంగా తీసుకునే వారిలో కనిపించే లక్షణాలు. వాతము, వేడి రెండు కలిసి జబ్బులు పెరగడానికి కారణం అవుతాయి. అగ్నికి గాలి తోడైతే మంటలు వ్యాపించినట్టుగానే, శరీరమంతా వేడి ఎక్కువ అవుతుంది.

కారంశరీరావయవాలు  క్రమంగా శిథిలం అవుతాయి.  కాళ్ళు, నరాలు పట్టు కోల్పోయి శరీరం పటుత్వం తగ్గిపోతుంది. మనసులో సంతోషం, ఉత్సాహం నశించిపోయి ఏర్పడే పరిస్థితిని “గ్లాని” అంటారు. నిరాశా నిస్పృహలు ఆవరించినట్టు వ్యక్తి నిస్తేజంగా తయారయిపోయిన వాళ్లలో చాలా శాతం ఎక్కువ కారం తినేవారు అయి ఉంటారు.  అందుకే విదేశాల్లో మిరపకాయలకు బదులు మిరియాలు ఉపయోగిస్తారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR